వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Marriage: పాక్ పాలకోవా, బాంగ్లా ఫిగర్లు కావాలంటే కుదరదు, వెంపర్లాడుతున్నారు, సౌదీ షాక్ !

|
Google Oneindia TeluguNews

సౌదీ/పాకిస్థాన్: విదేశీయులను పెళ్లి చేసుకోవాలని కలలు కంటున్న యువకులకు సౌదీ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. భారత దాయాది దేశం పాకిస్థాన్ తో పాటు మయన్మార్, చాడ్, బాంగ్లాదేశ్ కు చెందిన యువతులను పెళ్లి చేసుకోవడం కుదరని, ఇప్పటికే మన కొంపకోల్లేరు అయిపోయిందని సౌదీ ప్రభుత్వం ఆ దేశంలోని యువకులకు తేల్చి చెప్పింది. విదేశీయులను పెళ్లి చేసుకోవడానికి యువకులు సౌదీ ప్రభుత్వం వింత నియమాలు పెట్టిందని అప్పుడే పాకిస్థాన్ పాడు మీడియా తప్పుడు ప్రచారం మొదలుపెట్టింది. పాక్ పాలకోవా, బాంగ్లా ఫిగర్ల విషయంలో సౌదీ యువకులు వెంపర్లాడుతున్నారని గుర్తించిన సౌదీ ప్రభుత్వం ఆదేశంలోని యువకులకు గట్టి షాక్ ఇచ్చింది.

NRI wife: అబ్బా.... ఎంతపని చేసింది, లాడ్జ్ లో ?, నిన్న మొగుడు, నేడు ప్రియుడు, హైటెక్ స్కెచ్ !NRI wife: అబ్బా.... ఎంతపని చేసింది, లాడ్జ్ లో ?, నిన్న మొగుడు, నేడు ప్రియుడు, హైటెక్ స్కెచ్ !

 పాక్ పాడు మీడియా

పాక్ పాడు మీడియా

విదేశీయులను పెళ్లి చేసుకోవాలనుకుంటున్న యువకులకు సౌదీ ప్రభుత్వం వింత నియమాలు పెడుతోందని పాకిస్థాన్ లోని డాన్ పత్రిక కథనం ప్రచురించింది. పాకిస్థాన్, మయన్మార్, చాడ్, బాంగ్లాదేశ్ దేశాలకు చెందిన మహిళలను సౌదీ యువకులు పెళ్లి చేసుకోవడానికి వీలులేకుండా సౌదీ ప్రభుత్వం నిషేధం విధించిందని పాకిస్థాన్ కు చెందిన డాన్ ప్రతిక వరుస కథనాలు ప్రచురిస్తోంది.

 పాక్ పాలకోవ.... మయన్మార్ మసాలాలు

పాక్ పాలకోవ.... మయన్మార్ మసాలాలు

విదేశీయులను వివాహం చేసుకోవాలని నిర్ణయించుకునే యువకులకు కఠిన నియమాలు విధిస్తున్నామని మక్కా పోలీసు డైరెక్టర్ జనరల్ అస్పాఫ్ అల్-ఖురేషి చెప్పారని మక్కా దినపత్రిక కథనం వెళ్లడించింది. ఇక ముందు మాకు పాకిస్థాన్ పాలకోవా కావాలని, మయన్మార్ మసాలాలు కావాలని, బాంగ్లాదేశ్ ముద్దుగుమ్మలు కావాలని కోరికలు కోరరాదని మక్కా పోలీసు జనరల్ అస్సాఫ్ అల్- ఖురేషి తేల్చి చెప్పారని మక్కా దినపత్రిక సౌదీ అరేబియాకు చెందిన యువకులకు సందేశం ఇచ్చింది.

 సౌదీలో ఇన్ని లక్షల మంది విదేశీయులా ?

సౌదీలో ఇన్ని లక్షల మంది విదేశీయులా ?

వాస్తవానికి సౌదీ లెక్కల ప్రకారం సౌదీ యువకులు వివాహాలు చేసుకున్న 5,00,000 మందికి పైగా పాకిస్థాన్, బాంగ్లాదేశ్, మయన్మార్, చాడ్ దేశాలతో పాటు ఇతర దేశాలకు చెందిన మహిళలు సౌదీ అరేబియాలో మకాం వేశారని సమాచారం. సౌదీ యువకులు విదేశీ మహిళలను పెళ్లి చేసుకోకుండా సౌదీ ప్రభుత్వం కఠిన నియమాలు పెట్టి వారి హక్కులను నాశనం చేస్తోందని ఆరోపిస్తూ పాకిస్థాన్ కు చెందిన డాన్ పత్రిక కథనం ప్రచురించింది.

 సౌదీ తప్పు ఏముంది ?

సౌదీ తప్పు ఏముంది ?

విదేశీయులను వివాహం చేసుకునే సౌదీ యువకులు ముందుగా సౌదీ ప్రభుత్వం అనుమతి తీసుకోవాలని పోలీసు డైరెక్టర్ జనరల్ ఖురేషి స్పష్టం చేశారు. 25 ఏళ్ల వయసు పైబడిన యువకులు విదేశీ యువకులను వివాహం చేసుకోవడానికి దరఖాస్తు చేసుకోవాలని, అందుకు సరైన పత్రాలు జత చెయ్యాలని సౌదీ ప్రభుత్వం తేల్చి చెప్పింది. సౌదీ ప్రభుత్వం చెప్పినదాంట్లో తప్పు ఏముందో అనే విషయం మాత్రం పాక్ మీడియా చెప్పకుండా ఆరోపణలు చేస్తోంది.

 విడాకులు తీసుకుని రెండో పెళ్లి అంటే ?

విడాకులు తీసుకుని రెండో పెళ్లి అంటే ?

సౌదీ యువకులు విడాకులు తీసుకోవాలంటే కచ్చితంగా ఆరు నెలలు వేచి ఉండాలని సౌదీ ప్రభుత్వం స్పష్టం చేసింది. వివాహం చేసుకున్న మహిళ వికలాంగురాలైనా, శుభ్రంగా లేకపోయినా, దీర్ఠకాలిక వ్యాధితో బాధపడుతున్నదని ప్రభుత్వం అనుమతి పొందిన ఆసుపత్రి ఇచ్చిన సర్టిఫికెట్ తీసుకుని విడాకులకు దరఖాస్తు చేసుకోవాలని సౌదీ ప్రభుత్వం సూచించింది. విడాకులు తీసుకుని వెంటనే రెండో పెళ్లి చేసుకోవాలంటే కుదరని సౌదీ ప్రభుత్వం తేల్చి చెప్పింది.

 వెంపర్లాడి ఎగిరిపడితే అంతేగతి

వెంపర్లాడి ఎగిరిపడితే అంతేగతి

విదేశీ మహిళలను పెట్టి చేసుకోవాలని అనుకునే యువకులు మొదట స్థానిక మేయర్ సంతకం తీసుకోవాలని, ప్రభుత్వం ఇచ్చిన అతని కుటుంబంలోని అన్ని సర్టిపికెట్లు జత చెయ్యాలని సౌదీ ప్రభుత్వం కట్టుదిట్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఇంతకాలం పాకిస్థాన్ పాలకోవా అమ్మాయిలు, బాంగ్లాదేశ్ బంతిపూల ముద్దుగుమ్మలను పెళ్లి చేసుకోవాలని ఎగిరెగిరిపడిన సౌదీ యువకులు అక్కడి ప్రభుత్వం సరైన శాస్తి చేసింది.

English summary
Marriage: Saudi Arabia has prohibited its men from marrying women from Pakistan, Bangladesh, Chad and Myanmar, Pak newspaper Dawn reported citing a report in Saudi media.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X