షాక్: స్పెషల్ క్లాసులంటూ విద్యార్థులతో బలవంతంగా సెక్స్, 40ఏళ్ల జైలు
విద్యార్థులకు మంచి విద్యాబుద్ధులు నేర్పి ఆదర్శంగా ఉండాల్సిన ఓ ఉపాధ్యాయురాలు.. తన బాధ్యతను మరిచి దారుణానికి తెగబడింది. విద్యార్థులతోనే ఆమె బలవంతంగా లైంగిక వాంఛను తీర్చుకుంది.
బొగొటా: విద్యార్థులకు మంచి విద్యాబుద్ధులు నేర్పి ఆదర్శంగా ఉండాల్సిన ఓ ఉపాధ్యాయురాలు.. తన బాధ్యతను మరిచి దారుణానికి తెగబడింది. విద్యార్థులతోనే ఆమె బలవంతంగా లైంగిక వాంఛను తీర్చుకుంది. అంతేగాక, ఈ విషయంలో వారికి గ్రేడ్లు ఇవ్వడం గమనార్హం. ఈ దారుణ ఘటన కొలంబియా దేశంలో చోటు చేసుకుంది.

స్పెషల్ క్లాసులంటూ సెక్స్ పాఠాలు..
ఆ వివరాల్లోకి వెళితే.. యోకాస్తా ఎం(40) అనే టీచరమ్మ కొలంబియాలోని మెడిలిన్ సిటీలోని ఒక ప్రైవేట్ బాలుర పాఠశాలలో పనిచేస్తోంది. కాగా, ఈ టీచర్ 15 నుంచి 19 మధ్యనున్న టీనేజ్ విద్యార్థులను స్పెషల్ తరగతుల పేరుతో.. ఇంటికి పిలిపించుకుని.. వారితో తన లైంగిక వాంఛను తీర్చుకునేది.

లైంగిక చర్యలకు గ్రేడ్లు
అంతేగాక విద్యార్థులకు స్కూల్లో ర్యాంకులు, గ్రేడ్లు ఇచ్చినట్లునే ఈమె.. ఈ విషయంలో కూడా వారికి గ్రేడ్లను కూడా ఇవ్వడం గమనార్హం. టీనేజ్ విద్యార్థులను ఆకర్షించేందుకు ఆమె వాట్సప్, ఫేస్‌బుక్ ఇతర సామాజిక మాధ్యమాలను కూడా ఉపయోగించుకుంది.

కామటీచర్ బాగోతాలు ఇలా వెలుగులోకి
ప్రారంభంలో చదువు చెబుతున్నట్లు వారిని నమ్మించి.. నెమ్మదిగా వారిని ఆకర్షించేది.ఆ తర్వాత విద్యార్థులతో తన లైంగిక వాంఛను తీర్చుకునేది. అయితే, ఆమె చేసే పనులు నచ్చని ఒక విద్యార్థి తన తల్లిదండ్రులకు చెప్పడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

వదిలేసిన భర్త.. 40ఏళ్ల జైలు శిక్ష విధించిన కోర్టు
ఆ మహిళా కీచక ఉపాధ్యాయురాలిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేశారు. కేసును విచారించిన కోర్టు.. ఈ వ్యహరాన్ని తీవ్రంగా పరిగణించి, నిందిత ఉపాధ్యాయురాలికి 40ఏళ్ల జైలు శిక్షను విధించింది. కాగా, ఇంతకుముందే ఈ టీచర్ వ్యవహారం నచ్చక కట్టుకున్న భర్త.. ఆమెకు విడాకులు కూడా ఇవ్వడం గమనార్హం.












Click it and Unblock the Notifications