అమెరికాలో రోడ్డు ప్రమాదంలో తెలుగు మహిళ నాగమణి మృతి

Posted By:
Subscribe to Oneindia Telugu

అట్లాంటా: అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలుగు మహిళ నాగమణి మరణించారు. అట్టాంటాలోని న్యూటన్ కౌంటీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నాగమణి తలకు తీవ్రగాయాలయ్యాయి. ఆమెను ఆసుపత్రిలో చికిత్సపొందుతూ ఆమె మరణించింది. మరో వైపు న్యూయార్క్ లో పాదచారులపై కారు దూసుకెళ్ళిన ఘటనలో ఒకరు మరణించగా, 22 మంది గాయపడ్డారు.

అట్లాంటాలోని న్యూటన్ కౌంటీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నాగమణి తీవ్రంగా గాయపడ్డారు. హెన్నీ కౌంటీలో నివాసం ఉంటున్న తనికెళ్ళ శంభుప్రసాద్ సతీమణి నాగమణి. ఆమె టీచర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆటా టీమ్ ఘటనాస్థలికి చేరకొని సహాయచర్యలను చేపట్టింది.

accident

మరో వైపు న్యూయార్క్ లో పాదచారులపై కారు దూసుకెళ్ళిన ఘటనలో ఒకరు మరణించగా,22మంది తీవ్రంగా గాయపడ్డారు.కారు డ్రైవర్ రిచర్డ్ రోజస్ ను పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు.

న్యూయార్క్ లోని సెవెంత్ ఎవెన్యూ 45వ, స్ట్రీట్ వద్ద ఈ ఘటన చోటుచేసుకొంది. ఒక్కసారిగా పెద్ద శబ్దం చేస్తూ కారు పాదచారులపైకి దూసుకెళ్ళింది. అయితే ఈ ఘటన ప్రమాదవశాత్తు జరిగిందా లేదా ఉగ్రవాద కోణంలో చోటుచేసుకొందా అనే విషయమై పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
An out-of-control car speeding the wrong way on Seventh Avenue plowed into several pedestrians in Times Square Thursday — killing one and injuring 22 others, authorities said.
Please Wait while comments are loading...