భవిష్యత్తులో ఆపరేషన్ సింధూర్ ను ఎదుర్కొనేందుకు పాకిస్థాన్ మాస్టర్ ప్లాన్..?

భారత్ దాయాది పాకిస్థాన్ తో ఎప్పుడూ ముప్పు పొంచి ఉంటూనే ఉంది. భారత్ పై ఉగ్రవాదుల్ని ఉసిగొల్పి పాకిస్థాన్ ఇప్పటికే అనేక సార్లు దాడులకు పాల్పడింది. గతేడాది ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది అమాయక టూరిస్టుల ప్రాణాలను తీసుకున్నారు ఉగ్ర మూకలు. ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాకిస్థాన్ ఈ ఘటన వెనకాల ఉన్నట్లు గ్రహించిన భారత్ ఆ దేశంపై ఆపరేషన్ సింధూర్ చేపట్టిన సంగతి తెలిసిందే. పాకిస్థాన్, పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ లోని 9 కీలక ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసి వాటిని పూర్తిగా ధ్వంసం చేసింది. అలాగే వందలాది మంది ఉగ్రమూకలను ఏరివేసింది. అయితే పాకిస్థాన్ మళ్లీ ఎప్పుడైన తోక జాడిస్తే.. ఉగ్రవాద దాడులకు ప్రయత్నిస్తే ఆపరేషన్ సింధూర్ 2.O స్టార్ట్ చేస్తామని చాలా సార్లు భారత్ హెచ్చరిస్తూ వస్తోంది. ఈ క్రమంలో అప్రమత్తమైన పాకిస్థాన్ ఇటీవల మక్కా ఒప్పందానికి తెరలేపిన సంగతి తెలిసిందే.

ఆగస్టు 7 ఈ మక్కా ఒప్పందం ఏర్పడింది. సౌదీ అరేబియా, టర్కీ, పాకిస్థాన్ ల మధ్య ఈ మేరకు ఒప్పందం జరిగింది. పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలు, భద్రతా సవాళ్ల నేపథ్యంలో ఈ దేశాలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. సౌదీ అరేబియా మక్కాలోని అల్ సఫా ప్యాలెస్ లో ఈ ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. ఈ మేరకు ఈ ఒప్పందంపై సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్, టర్కీ అధ్యక్షుడు తయ్యప్ ఎర్దోగన్, పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ లు సంతకాలు చేశారు. ఇక కలెక్టివ్ డిఫెన్స్ లో భాగంగా ఇకపై ఏ దేశంపైనా ఇతర దేశం దాడి చేస్తే మూడు దేశాలపైనా దాడులు చేసినట్లుగా భావిస్తారు. ఈ నేపథ్యంలో ఒకవేళ భారత్ భవిష్యత్తులో పాకిస్థాన్ పై దాడులు చేస్తే టర్కీ, సౌదీ అరేబియా పాకిస్థాన్ కు సపోర్ట్ గా ఉంటాయా..? అనే సందేహం ఇప్పుడు వ్యక్తం అవుతోంది.

MeccaAgreement In the wake of the will India hinder Pakistan s Operation Sindhur in the future

అయితే ఈ ప్రశ్నపై తాజాగా ప్రముఖ దౌత్యవేత్త టీపీ శ్రీనివాసన్ కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ లోని భూభాగాన్ని ఇతర దేశం స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నిస్తే టర్కీ, సౌదీ అరేబియా దేశాలు పాకిస్థాన్ కు సహకారం అందిస్తాయని అన్నారు. అంతేకానీ ఉగ్రవాద కార్యకలాపాలకు ఆయా దేశాల నుంచి మద్దతు ఉండదని స్పష్టం చేశారు. ఇక ఇజ్రాయెల్, అమెరికా మాత్రం ఈ మక్కా ఒప్పందాన్ని అనుమానంగానే చూస్తున్నాయి. ఈ కూటమిలో టర్కీ, పాకిస్థాన్ లు ఉన్న నేపథ్యంలో ఈ మక్కా ఒప్పందంపై అమెరికా అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఇక చైనా ఈ ఒప్పందాన్ని స్వాగతించే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+