ఎంహెచ్ 17 షాకింగ్: 'రష్యా' మిసైల్‌తో కూల్చేశారు
కౌలాలంపూర్: గత ఏడాది ఉక్రెయిన్‌లో కూలిన మలేషియా ఎయిర్ లైన్స్ విమానం ఎంహెచ్ 17 ప్రమాదం గురించి షాకింగ్ అంశాలు వెల్లడవుతున్నాయి. ఈ విమానం మిసైల్ వల్ల కూలిందనే వాదనలు వినిపిస్తున్నాయి.
రష్యాలో తయారైన క్షిపణితో దాడి చేయడం వల్ల ఎంహెచ్ 17 విమానం కూలిపోయిందని నెదర్లాండ్స్ సేఫ్టీ బోర్డు తన నివేదికలో వెల్లడించింది. 9ఏఎం38 క్షిపణి మలేషియా విమానం ముందు భాగాన్ని ఢీకొట్టిందని, దీంతో ఆ విమానం పేలిపోయిందని నివేదికలో పేర్కొన్నారు.

రష్యా ప్రభుత్వం మద్దతిస్తున్న తిరుగుబాటుదారులు ఈ విమానాన్ని కూల్చి వేశారని ఉక్రెయిన్ ఆరోపిస్తుండగా, ఉక్రెయిన్ నియంత్రణలో ప్రాంతంలో నుంచి క్షిపణి ప్రయోగించారని రష్యా చెబుతోంది. క్షిపణితో విమానం పైకి దాడి చేసింది ఎవరనే విషయాన్ని డచ్ సేఫ్టీ బోర్డు నివేదికలో పేర్కొనలేదు.
ఉక్రెయిన్ ప్రభుత్వ దళాలకు, రష్యా అనుకూల తిరుగుబాటుదారులకు మధ్య పోరు జరుగుతోంది. కాగా, గతేడాది జూలైలో జరిగిన ఈ విమాన ప్రమాదంలో 298 మంది మృతి చెందారు. నెదర్లాండ్స్ రాజధాని ఆమ్‌స్టర్ డామ్ నుంచి కౌలాలంపూర్ వెళ్తుండగా తూర్పు ఉక్రెయిన్‌లో కూలింది.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications