ఎం యూనిట్ క్లోజ్: 1,350 ఉగ్యోగాల కోత పెట్టిన మైక్రోసాఫ్ట్

Subscribe to Oneindia Telugu

హెల్సింకీ: ఫిన్నిస్ మొబైల్ ఫోన్ యూనిట్‌ను మూసేస్తున్నట్టు అమెరికా సాప్ట్‌వేర్ దిగ్గజం మైక్రోసాప్ట్ వెల్లడించింది. ఈ క్రమంలో ఫిన్‌లాండ్‌లో 1,350 ఉద్యోగాలకు కోత పెట్టనున్నట్టు సోమవారం ప్రకటించింది. స్మార్ట్ ఫోన్ల వ్యాపారాన్ని క్రమబద్ధీకరణ భాగంలో 1,850 ఉద్యోగులను తొలగించనున్నట్లు మైక్రోసాప్ట్ గత మేలోనే ప్రకటించింది.

కాగా, ఫిన్‌లాండ్‌లోని ఈ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ యూనిట్‌ను మూసేస్తున్నామని తాజాగా వెల్లడించింది. ఎక్కువ ఉద్యోగాల కోతలు ఫిన్‌లాండ్‌లో ఉంటాయని అప్పుడే స్పష్టం చేసింది కూడా. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న మొబైల్ ఫోన్ల తయారీ సంస్థ నోకియాను గత సంవత్సరం కొనుగోలు చేయడం ద్వారా మైక్రోసాప్ట్, ఫోన్ల వ్యాపారంలోకి అడుగుపెట్టింది.

ఈ కొనుగోలు అనంతరం 54వేల జనాభా ఉన్న దక్షిణ ఫిన్‌లాండ్‌లోని సాలో పట్టణ నివాసులకు ఉద్యోగవకాశాలు మెరుగుపర్చింది. పదేళ్ల క్రితం వరకు నోకియా ఆపరేషన్స్‌లో సాలో ఉద్యోగులు ఐదు వేల మంది ఉన్నారు. ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీలోనే వారు ఎక్కువగా ఉద్యోగాలు పొందుతున్నారు. కానీ మైక్రోసాప్ట్ నిర్ణయంతో వారి ఆశలన్నీ ఒక్కసారిగా ఆవిరయ్యాయి.

Microsoft Confirms Mobile Unit Closure, 1,350 Job Cuts in Finland

ఆ పట్టణంలో ఉన్న నోకియా ప్రొడక్ట్ డెవలప్ మెంట్ యూనిట్ మూసివేస్తున్నామనే ప్రకటనతో తమ ఉద్యోగాలు రిస్క్ లో పడబోతున్నాయనే ఆందోళనలను వ్యక్తంచేస్తున్నారు. గతేడాది కూడా ఈ యూఎస్ దిగ్గజం సాలో పట్టణ నివాసులను ఎక్కువ ఉద్యోగాల్లో చేర్చుకుంటామని ప్రకటించింది.

అయితే, ఫోన్ల బిజినెస్‌ ఆశించిన స్థాయిలో లేకపోవడంతో, ఫిన్‌లాండ్ రీసెర్చ్ డెవలప్‌మెంట్ యూనిట్‌ను మూసివేయడంతోపాటు 1,350 ఉద్యోగులను తొలగించాలని మైక్రోసాప్ట్ తాజాగా ప్రకటించింది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Microsoft on Monday confirmed it will close its Finnish mobile phone unit and cut up to 1,350 jobs in the Nordic country.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి