Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Haj Pilgrims Death: హజ్ యాత్రలో విషాదం-50 డిగ్రీల ఎండకు 500 మందికి పైగా బలి..!

ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు ఏటా నిర్వహించే సౌదీ అరేబియాలోని హజ్ యాత్ర ఈసారి విషాదాంతంగా మారుతోంది. ఈసారి ఎడారి నగరమైన మక్కాలో ఉష్ణోగ్రతలు తారా స్దాయికి చేరడంతో హజ్ యాత్రకు వెళ్లిన వారు భారీ సంఖ్యలో మృత్యువాత పడుతున్నారు. సౌదీ ప్రభుత్వం ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా ఎండల ప్రభావం తీవ్రంగా ఉండటంతో యాత్రికులు చనిపోతున్నారు. ఇందులో భారతీయులు కూడా ఉన్నారు.

గతంలో ఎన్నడూ లేనంత దారుణంగా మండిపోతున్న ఎండలతో హజ్ యాత్రికులు విలవిల్లాడుతున్నారు. ఏటా బక్రీద్ మాసంలో జరిగే ఈ యాత్రకు వివిధ దేశాల నుంచి లక్షల సంఖ్యలో యాత్రికులు తరలివస్తుంటారు. అయితే ఈసారి మాత్రం సౌదీలో రికార్డు స్ధాయిలో 50 డిగ్రీలకు పైగా నమోదవుతున్న ఎండలకు వారు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. అందులోనూ హజ్ యాత్ర చేసే వారిలో వృద్ధులు, మధ్య వయస్సు వారు ఎక్కువ మంది ఉంటుంటారు. వీరంతా ఎండ ధాటికి తట్టుకోలేక చనిపోతున్నారు.

more than 500 haj pilgrims died due to above 50 degree temperatures in mecca

ఈ ఏడాది హజ్ యాత్రకు వెళ్లి మృత్యువాత పడిన వారిలో 323 మంది వరకూ ఈజిప్షియన్లు ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే 60 మంది వరకూ జోర్డాన్ వాసులు మరణించారని దౌత్యవేత్తలు తెలిపారు. ఇరాన్, సెనెగల్ తో పాటు ఇతర దేశాల నుంచి వచ్చిన వారు కూడా మృతుల్లో ఉన్నట్లు తెలుస్తోంది. భారత్ నుంచి కూడా ప్రతీ ఏటా భారీ సంఖ్యలో హజ్ యాత్రకు వెళ్తుంటారు. దీంతో వారి తాజా పరిస్దితులపై ప్రభుత్వం ఆరా తీస్తోంది. సౌదీ ప్రభుత్వం వర్చువల్ ఆస్పత్రులను ఏర్పాటు చేసి బాధితులకు చికిత్స అందిస్తోంది. హజ్ యాత్ర నిర్వహణ సౌదీ ప్రభుత్వానికి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఉంటుంది.

వివిధ దేశాల నుంచి హజ్ యాత్రకు వచ్చిన వారిలో ఎంతమంది తప్పిపోయారన్న దానిపై కూడా దౌత్యవేత్తలు వివరాలు సేకరిస్తున్నారు. ఈ గణాంకాలు అందితే తుది లెక్కలు ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటి వరకూ గుర్తించిన మృతదేహాల్ని మాత్రం స్వదేశాలకు తరలించేందుకు ప్రయత్నిస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+