వ్యూస్ కోసం కొడుకుపైనే ప్రమాదకర ప్రయోగం.. అసలు ఈమె తల్లేనా? (వీడియో)

Viral Video: వ్యూస్ మోజులో కన్న ప్రేమ కరువైంది! సోషల్ మీడియాలో లైకుల కోసం కన్న కొడుకు ప్రాణాలనే పణంగా పెట్టింది ఓ కర్కశ తల్లి. ఊపిరాడక పిల్లాడు విలవిల్లాడుతున్నా పట్టించుకోని ఆ మాతృమూర్తి చర్యలపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. సోషల్ మీడియాలో వ్యూస్, లైక్స్ కోసం ఆ తల్లి తన కన్నకొడుకుపైనే అత్యంత ప్రమాదకరమైన ప్రయోగాన్ని చేసింది. ఈ ఘటనపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈ ఘటన రష్యాలోని సరటోవ్‌లో చోటుచేసుకుంది. అన్నా సపరీనా(36) అనే మహిళ ఓ పేరెంటింగ్ బ్లాగ్ నిర్వహిస్తోంది. ఇటీవల ఆమె తన బ్లాగ్ కోసం కంటెంట్‌ను చిత్రీకరిస్తూ.. ఓ షాకింగ్ వీడియోను రికార్డ్ చేసింది. అన్నా సపరీనా తన చిన్న కొడుకును తీసుకుని అతడిని ఓ పెద్ద ప్లాస్టిక్ బ్యాగులో ఉంచింది. ఆ తర్వాత బ్యాగ్ మూతిని గట్టిగా పట్టుకొని.. దానిలో నుంచి గాలి పూర్తిగా బయటికి పంపేసింది. గాలి అందకపోవడంతో ఆ చిన్నారి కొన్ని సెకన్లకే ఊపిరి ఆడక విలవిల్లాడిపోయాడు. ఆ ప్లాస్టిక్ బ్యాగులో ఉండలేక భయంతో "అమ్మా!" అంటూ గట్టిగా కేకలు పెట్టాడు.

Mother Endangers Son for Social Media Views Shocking Viral Video Sparks Global Outrage

నెటిజన్ల మండిపాటు
ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది వెంటనే వైరల్ అయింది. అయితే ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆ తల్లిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. "కేవలం వ్యూస్ కోసం కన్న కొడుకు ప్రాణాలనే పణంగా పెడతారా?", "అసలు ఈమె తల్లేనా? బిడ్డకు ఎలాంటి ప్రమాదం జరిగినా ఎవరు బాధ్యత వహిస్తారు?", "ఇలాంటి ప్రమాదకరమైన ప్రయోగాలు చేసి ఇతరులను కూడా ప్రోత్సహిస్తున్నందుకు ఆమెపై చర్యలు తీసుకోవాలి" అంటూ నెటిజన్లు ఆమె విరుచుకుపడుతున్నారు. పిల్లల భద్రతను లెక్క చేయకుండా సోషల్ మీడియాలో దృష్టిని ఆకర్షించడానికి తల్లి చేసిన ఈ చర్యను ప్రపంచవ్యాప్తంగా ఉన్న నెటిజన్లు తీవ్రంగా ఖండిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+