గుండె సమస్యతో హుటాహుటిన ఆస్పత్రికి ముషార్రఫ్

భద్రతా కారణాలు చూపి గత రెండు సెషన్స్‌కు పర్వేజ్ ముషార్రఫ్ కోర్టుకు రాలేదు. దాంతో 70 ఏళ్ల ముషార్రఫ్‌కు కోర్టు సమన్లు జారీ చేసింది. భారీ భద్రత మధ్య కోర్టుకు తీసుకుని వస్తుండగా ముషార్రఫ్ అనారోగ్యానికి గురయ్యారని ఓ సీనియర్ పోలీసు అధికారి జాన్ మొహమ్మద్ కోర్టుకు చెప్పారు.
గుండె సంబంధమైన సమస్య తలెత్తడంతో ముషార్రఫ్‌ను సైనిక బలగాల కార్డియోలజీ సంస్థకు తరలించారు. ముషార్రఫ్ పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా ఉందని అంటున్నారు.
ముషార్రఫ్ 1999 నుంచి 2008 వరకు సాగించిన తన పాలనలోని పలు వ్యవహారాలకు కేసులను ఎదుర్కుంటున్నారు.












Click it and Unblock the Notifications