పాక్ వస్తే: బేనజీర్ భుట్టోను ముషారఫ్ బెదిరించారా?
కరాచీ: పర్వేజ్ ముషారఫ్ దివంగత బేనజీర్ భుట్టోను బెదిరించారా? అంటే అవుననే అంటున్నారు ఓ విలేకరి. అమెరికాకు చెందిన జర్నలిస్ట్ మార్క్ సీజెల్ ఈ విషయాన్ని వెల్లడించారు. బేనజీర్ భుట్టోను నాడు ముషారఫ్ దేశానికి రావొద్దని బెదిరించాడని పేర్కొన్నారు.
సమాచారం మేరకు... స్వయంగా దేశం వదిలి వెళ్లిపోయిన అనంతరం తిరిగి 2007 అక్టోబర్‌లో వచ్చే ముందు... ముషారఫ్ ఆమెకు హెచ్చరికలు జారీ చేశారు. అమెరికాలో ఆమెను కలిసి హెచ్చరికలు జారీ చేశారు.

పాకిస్తాన్‌కు తిరిగి వస్తే నీ జీవితం ప్రమాదంలో పడుతుందని ముషారఫ్.. బేనజీర్ భుట్టోను హెచ్చరించారు. ఇందుకు సంబంధించిన వీడియో సదరు జర్నలిస్ట్ అమెరికాలోని పాకిస్తాన్ ఎంబసీ నుంచి సేకరించారు.












Click it and Unblock the Notifications