ట్రంప్ కంటే నా నాలుగేళ్ల కూతురు బాగా పాలించగలదు: కిమ్ కర్దాషియన్

ట్రంప్‌ కంటే తన నాలుగేళ్ల వయస్సు ఉన్న కూతురు నార్త్‌ వెస్ట్‌ చక్కగా బాధ్యతలు నిర్వర్తించగలదని కిమ్ కర్దాషియన్ అన్నారు.ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు.

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షులు డొనాల్డ్‌ ట్రంప్‌ కంటే తన నాలుగేళ్ల వయస్సు ఉన్న కూతురు నార్త్‌ వెస్ట్‌ చక్కగా బాధ్యతలు నిర్వర్తించగలదని నటి, మోడల్ కిమ్ కర్దాషియన్ అన్నారు.

ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. కొన్నిసార్లు తనకు రాజకీయాల గురించి చర్చించాలనిపిస్తుందని, తాను ఎవర్నీ కించపరచాలని అనుకోవడం లేదని, మనకేం కావాలో వాటిని పొందుతూ మన దేశంలో గర్వంగా నివసిస్తున్నామని చెప్పారు.

My four year old daughter could do better job than Donald Trump: Kim Kardashian

రోజూ దేశంలో జరిగేకొన్ని విషయాలను మనం నమ్మేలోపే మరుసటి రోజు అంతకుమించిన ఘటనలు జరుగుతున్నాయని, ఇప్పుడున్న ప్రపంచం చాలా భయంకరమైనదన్నారు.

మొన్నటి వరకు అమెరికాలో హాయిగా నిశ్చితంగా ఉన్న మనం, ట్రంప్‌ అధ్యక్షులు కావడంతో ఇక ఆ రక్షణ ఉండదనిపిస్తోందని వ్యాఖ్యానించారు.

అమెరికా దేశాన్ని ఎవరైనా సరైన మార్గంలో నడిపించగలరని, చెప్పాలంటే ట్రంప్‌ కంటే నాలుగేళ్ల తన కూతురు బాగా పాలన చేయగలదని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+