ఆస్ట్రేలియా బీచ్‌లో మిస్టిరీయస్ ఆబ్జెక్ట్ కలకలం: చంద్రయాన్-3 శకలమేనా?
మెల్బోర్న్: ఆస్ట్రేలియా తీరంలో ఓ అంతుచిక్కని వస్తువు(Mysterious object) ఒకటి కలకలం రేపుతోంది. భారీ పరిమాణంలో ధ్వంసమైన స్థితిలో ఉన్న ఆ స్థూపాకారపు రాగి రంగు లోహపు వస్తువు ఏంటనేది ఆసక్తికరంగా మారింది. పశ్చిమ ఆస్ట్రేలియా(Australia)లోని గ్రీన్ హెడ్ పట్టణ తీరంలోకి ఇది కొట్టుకువచ్చి పడింది. ఈ క్రమంలోనే రంగంలోకి దిగిన అధికారులు.. ఆ వస్తువుకు దూరంగా ఉండాలని ప్రజలకు హెచ్చరించారు.
అది ఎక్కడ్నుంచి వచ్చింది? ప్రమాదకరమా? కాదా? అని తేల్చే పనిలో పడ్డారు అధికారులు. ప్రస్తుతం ఆ వస్తువుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక మిస్టరీ వస్తువుపై ఆస్ట్రేలియా స్పేస్ ఏజెన్సీ కూడా దర్యాప్తు ప్రారంభించింది. ఏదైనా విదేశీ అంతరిక్ష ప్రయోగ వాహనానికి సంబంధించిన వస్తువు కావొచ్చని అంచనా వేసింది.

ఈ విషయంపై ఆయా దేశాలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు ట్విట్టర్ వేదికగా వెల్లడించింది ఆస్ట్రేలియా స్పేస్ ఏజెన్సీ. ఆ వస్తువు ఎక్కడిదో తెలియని క్రమంలో.. దానికి దూరంగా ఉండాలని, కదిపే ప్రయత్నం చేయవొద్దని సూచించింది. దీనికి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామని పేర్కొంది.
We are currently making enquiries related to this object located on a beach near Jurien Bay in Western Australia.
— Australian Space Agency (@AusSpaceAgency) July 17, 2023
The object could be from a foreign space launch vehicle and we are liaising with global counterparts who may be able to provide more information.
[More in comments] pic.twitter.com/41cRuhwzZk
అయితే, ఆ మిస్టరీ వస్తువు భారతదేశం ఇటీవల ప్రయోగించిన పీఎస్ఎల్వీ రాకెట్‌కు సంబంధించినదిగా భావిస్దున్నట్లు అంతరిక్ష నిపుణురాలు డాక్టర్ ఏలిస్ గార్మన్ పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది. దీంతో ఆ వస్తువు ఇటీవల ప్రయోగించిన చంద్రయాన్-3కి సంబంధించిన వస్తువుగా అనుమానిస్తున్నారు.
Last friday, people in Australia reported seeing a comet/UFO in the sky which turned out to be the LVM3 rocket that launched #Chandrayaan3.
— Debapratim (@debapratim_) July 17, 2023
And now, the third stage of a PSLV rocket has washed ashore on the coast of Green Head, Western Australia! #ISRO pic.twitter.com/FFVwhooSyE
కాగా, చంద్రయాన్-3ను ఎల్వీఎం రాకెట్ నింగిలోకి మోసుకెళ్లిన దృశ్యాలు ఆస్ట్రేలియాలో కూడా కనిపించాయి. ఈ నేపథ్యంలో చంద్రయాన్-3 మిషన్‌కు సంబంధించిన శకలాలే అంటూ సోషల్ మీడియాలో ప్రచారం కూడా జరుగుతోంది. అయితే, ఈ వస్తువు ఏంటనేది మాత్రం అధికారికంగా ఎలాంటి ప్రకటనా లేదు.
-
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ?












Click it and Unblock the Notifications