చంద్రుడిపై రష్యా లూనా 25 కూలిన ప్రాంతమిదే-ఫొటోలు విడుదల చేసిన నాసా..
చంద్రుడి రహస్యాలు తెలుసుకునేందుకు భారత్ చంద్రయాన్ 3 ప్రయోగిస్తుందని తెలియగానే హడావిడిగా తామూ ఓ అంతరిక్ష నౌకను తయారు చేసి చంద్రయాన్ కంటే వేగంగా ప్రయోగించేందుకు ప్రయత్నించి రష్యా విఫలమైంది. లూనా 25 పేరుతో రష్యా ప్రయోగించిన అంతరిక్ష నౌక మన చంద్రయాన్ 3 కంటే ముందే చంద్రుడి దక్షిణ ధృవంపై అడుగుపెడుతుందని భావించగా.. అది కాస్తా రెండు రోజుల ముందే కుప్పకూలింది. దీంతో రష్యా అంతరిక్ష సంస్ధ రాస్ కాస్మోస్ కు నిరాశ తప్పలేదు.
చంద్రుడి ఉపరితలంపై దిగే క్రమంలో రష్యా అంతరిక్ష నౌక లూనా 25 ఇంజన్ వైఫల్యం ఎదుర్కోవడంతో కుప్పకూలింది. దీంతో భారత్ ప్రయోగించిన చంద్రయాన్ 3 కంటే ముందు చంద్రుడిపై అడుగుపెట్టాలన్న రష్యా కల నెరవేరలేదు. చివరకు చేసేది లేక ఆ నౌకను అక్కడి నుంచి వేరే ప్రాంతానికి తరలించేసింది. ఆ తర్వాత భారత్ ప్రయోగించిన చంద్రయాన్ 3 సక్సెస్ కావడంతో రష్యా అంతరిక్ష సంస్ధ రాస్ కాస్మోస్ తో పాటు రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్ కూడా భారత్ ను అభినందించారు.

NASA has released a Set of Images showing the Crash Site of the Luna-25 Moon Lander of the Russian Space Corporation, Roscosmos which Crashed on the South Pole of the Moon after an Engine Failure on August 19th. pic.twitter.com/UsSrq0jCXt
— OSINTdefender (@sentdefender) September 1, 2023
నాసా యొక్క లూనార్ రికనైసెన్స్ ఆర్బిటర్ (LRO) చంద్రునిపై ఓ బిలం కొత్త చిత్రాన్ని తన కెమెరాలో బంధించింది. ఇది రష్యా యొక్క లూనా 25 మిషన్ వైఫల్యం యొక్క ఫలితం అని భావిస్తున్నారు. లూనా 25 మిషన్ దాని అవరోహణ సమయంలో ఓ సాంకేతిక సమస్యను ఎదుర్కొంది. దీని వలన అది చంద్రుని ఉపరితలంపై ప్రభావం చూపింది. LRO బృందం కొత్తగా ఏర్పడిన బిలం సహజంగా సంభవించే దాని కంటే ఈ ప్రభావం యొక్క ఫలితం అని నమ్ముతోంది.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్ -
డొనాల్డ్ ట్రంప్ సడన్ యూటర్న్- యుద్ధ విరామం -
'ధురంధర్ 2'పై టాలీవుడ్ హీరోల ప్రశంసలు.. ప్రకాష్ రాజ్ రియాక్షన్ ఇదే!












Click it and Unblock the Notifications