వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉత్కంఠ: 'మార్స్ మిస్టరీ సాల్డ్వ్' అంటూ నాసా ట్వీట్

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: అంగారక గ్రహంపై ఓ రహస్యాన్ని కనుగొన్నామని అమెరికా అంతరిక్ష సంస్ధ నాసా వెల్లడించింది. మార్స్ ఎక్స్‌ప్లోరేషన్ మిషన్‌లో భాగంగా అత్యంత ముఖ్యమైన సైన్సు విషయాన్ని తాము తెలుసుకున్నామని తెలియజేస్తూ "మార్స్ మిస్టరీ సాల్డ్వ్" అంటూ నాసా పేర్కొంది.

ఈరోజు ఉదయం 11.30 గంటలకు (భారత కాలమానం ప్రకారం సోమవారం రాత్రి 9 గంటలకు) ప్రత్యేక మీడియా సమావేశంలో అంగారకుడిపై ద్రవరూపంలో ఉన్న నీటిని కనుగొన్న లుజెండ్రా ఓజా అందుకు సంబంధించిన వివరాలను తెలియజేస్తారన్నారు.

Nasa to reveal major Mars finding, prompting water speculation

వాషింగ్టన్‌లోని నాసా కేంద్ర కార్యాలయంలోని జేమ్స్ వెబ్ ఆడిటోరియంలో ఈ సమావేశం జరుగుతుందని వెల్లడించింది. ఈ కార్యక్రమాన్ని నాసా వెబ్‌సైట్ మాధ్యమంగా ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. ఈ మీడియా సమావేశానికి నాసా డైరెక్టర్ జిమ్ గ్రీన్, మార్స్ ఎక్స్ ప్లోరేషన్ లీడ్ సైంటిస్ట్ మైఖేల్ మేయర్ తదితరులు హాజరవుతారు.

అంగారక గ్రహంపై ఆక్సిజన్, నీటి లభ్యత ఉందనే విషయంపై గత కొన్ని సంవత్సరాలుగా నాసా ప్రయోగాలు చేస్తున్న సంగతి తెలిసిందే. తాజా ఈ మీడియా సమావేశానికి సంబంధించి అంగారకుడిపై జీవం ఉందని నాసా కనుగొని ఉండవచ్చని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. అందుకు సంబంధించిన ఆధారాలను చూపించవచ్చని భావిస్తున్నారు.

English summary
Nasa is to reveal a “major science finding” from its Mars exploration mission, giving rise to rumours that the US space agency has found traces of liquid water on the red planet.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X