Nepal Protests: నేపాల్ లో మళ్లీ జెన్ జీ నిరసనలు-పలు చోట్ల కర్ఫ్యూ ..!
ఈ ఏడాది సెప్టెంబర్ లో సోషల్ మీడియా బ్యాన్, ఇతర కారణాలతో నేపాల్ లో జెన్ జీ నిరసనకారులు రోడ్లపైకి వచ్చి చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఈ నిరసనల ధాటికి అప్పటి ప్రధాని కేపీ శర్మ ఓలీ పదవి నుంచి తప్పుకుని పారిపోయారు. అనంతరం అక్కడ తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. అయితే ఇవాళ మరోసారి నేపాల్ లో జెన్ జీ నిరసనకారులు ఆందోళనకు దిగారు. దీంతో మరోసారి ఉద్రిక్త పరిస్ధితులు తలెత్తాయి.
నేపాల్ లో పదవీచ్యుతుడైన మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలీకి చెందిన కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ - యూనిఫైడ్ మార్క్సిస్ట్ లెనినిస్ట్ (సిపిఎన్-యుఎంఎల్) మద్దతుదారులు తిరిగి పట్టు సంపాదించేందుకు ప్రయత్నిస్తున్నారు. దీన్ని అడ్డుకునేందుకు జెన్ జీ నిరసనకారులు ప్రయత్నించారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణలు తలెత్తాయి. బారా జిల్లాలో తలెత్తిన ఉద్రిక్తతలతో అక్కడ ప్రజలు సమావేశాలు కావడంపై నిషేధం విధించారు. శాంతి భద్రతల్ని పునరుద్ధరించడం కోసం కర్ఫ్యూ విధిస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు.

బారా జిల్లాలోని పలు ప్రాంతాల్లో శాంతిభద్రతలను పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని పేర్కొంటూ పోలీసులు ఇవాళ రాత్రి 8 గంటల వరకు కర్ఫ్యూ అమలు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. నిన్న బారా జిల్లాలోని సిమారా ప్రాంతంలో యువ నిరసనకారులు, సీపీఎన్-యూఎంఎల్ కార్యకర్తలు ఇద్దరూ ర్యాలీలు నిర్వహించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. త్వరలోనే రెండు గ్రూపుల మధ్య ఘర్షణలు చెలరేగాయి. వీటిలో కొన్ని విమానాశ్రయానికి దగ్గరగా ఉన్నాయి. దీంతో అధికారులు కర్ఫ్యూ విధించారు.

అయితే ప్రస్తుతానికి పరిస్థితి సాధారణంగా ఉందని, ఎవరూ తీవ్రంగా గాయపడలేదని నేపాల్ పోలీసు ప్రతినిధి అబి నారాయణ్ కఫ్లే వెల్లడించారు. నేపాల్ ప్రధాన మంత్రి సుశీలా కర్కి ప్రజలు ప్రశాంతంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. సెప్టెంబర్ తిరుగుబాటు తర్వాత తాత్కాలిక ప్రధాన మంత్రిగా నియమితులైన ఆమె.. రాజకీయంగా రెచ్చగొట్టడం మానుకోవాలని సూచించారు. వచ్చే మార్చి 5న జరిగే ఎన్నికలకు ముందు ప్రజాస్వామ్య ప్రక్రియను విశ్వసించాలని పిలుపునిచ్చారు. మరోవైపు నిన్న 110 కి పైగా పార్టీల ప్రతినిధులతో కార్కి సమావేశం కూడా నిర్వహించారు.ఈ దేశం కొత్త తరం చేతుల్లో ఉండాలని, దార్శనికత కలిగిన వ్యక్తులు పాలించాలని కోరుకుంటున్నట్లు ఆమె తెలిపారు.
-
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications