Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

H-1B కొత్త రూల్స్ అమలు వేళ ఎంబసీ బిగ్ అలర్ట్..! ఫ్రస్టేషన్ లో అలా చేస్తే..!

అమెరికాలో కంపెనీలు విదేశీ నిపుణులను నియమించుకునేందుకు జారీ చేస్తున్న హెచ్1బీ వీసా విధానంలో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ మార్పులు వచ్చే ఫిబ్రవరి 27నుంచి అమల్లోకి రాబోతున్నాయి. దీంతో ఇప్పటికే హెచ్1బీ వీసాల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి ఇంటర్వూలను వాయిదా వేశారు. ఈ నేపథ్యంలో భారత్ లోనే భారీ సంఖ్యలో హెచ్1బీ వీసాల రెన్యువల్ కోసం వచ్చిన వారు చిక్కుకుపోయారు. ఈ ఫ్రస్ట్రేషన్ లో వారు తప్పులు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

ఏదో విధంగా హెచ్1బీ వీసాలు పొందేందుకు వీలుగా మధ్యవర్తుల్ని ఆశ్రయించడం, అక్రమాలకు పాల్పడటం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత్ లో అమెరికా ఎంబసీ వారికి కీలక హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు ఎక్స్ లో పోస్టు చేసింది. ఇందులో మీరు అమెరికా చట్టాన్ని ఉల్లంఘిస్తే, గణనీయమైన క్రిమినల్ శిక్షలు విధించబడతాయని హెచ్చరించింది. ట్రంప్ ప్రభుత్వం అమెరికాకు అక్రమ వలసలను నిరోధించడానికి, దేశ సరిహద్దులను, పౌరులను రక్షించడానికి కట్టుబడి ఉందని గుర్తుచేసింది.

New H-1B Rules US Embassy s Critical Warning Avoid This Mistake to Dodge Criminal Penalties

అమెరికాలో ట్రంప్ ప్రభుత్వం వలసల నియంత్రణలను కఠినతరం చేయడానికి ప్రయత్నాలను ముమ్మరం చేస్తోంది. ఇందుకోసం చట్టపరమైన మార్గాలతో పాటు చట్టవిరుద్ధమైన మార్గాలను సైతం ప్రయోగిస్తోంది. అలాగే హెచ్-1బీ వంటి వీసాలకు కఠినమైన నియమాలు విధిస్తోంది. దీంతో అమెరికాలో ఉంటున్న భారతీయులకు ఇప్పటికే చుక్కలు కనిపిస్తున్నాయి. దీంతో హెచ్1 బీ వీసాల సమస్య తీరే వరకూ ఇళ్లలో నుంచి కూడా కదల్లేని పరిస్ధితుల్లో ఉంటున్నారు.

New H-1B Rules US Embassy s Critical Warning Avoid This Mistake to Dodge Criminal Penalties

ఇప్పుడు హెచ్1 బీ వీసాల కోసం వచ్చి భారత్ లో చిక్కుకుపోయిన వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. ఈ ఫిబ్రవరి 27న హెచ్1బీ కొత్త వీసా విధానం అమల్లోకి వస్తే కానీ వీరి సమస్య తీరేలా కనిపించడం లేదు. ఇలాంటి సమయంలో ఎంబసీ జారీ చేస్తున్న అలర్ట్ లు వారికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ముఖ్యంగా హెచ్1బీ వీసాల కోసం అడ్డదారుల్లో ప్రయత్నిస్తున్న వారితో పాటు ఇతరుల్లోనూ ఆందోళన పెరుగుతోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+