క్రైస్ట్‌చర్చ్ మారణహోమం: దురహంకారం.. కోర్టులో విజయసంకేతాన్ని చూపిన నిందితుడు
వెల్లింగ్టన్: క్రైస్ట్ చర్చ్ దాడి నిందితుడిపై హత్య కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు. న్యూజిలాండ్‌లోని క్రైస్ట్ చర్చ్ సిటీలో రెండు మసీదుల్లోకి చొరబడి జాత్యాహంకార ఉన్మాది బ్రెంటన్ టారెంట్ 50 మందిని ఊచకోత కోసిన విషయం తెలిసిందే. తాను చేసిన ఘోరంపై అతను ఏమాత్రం పశ్చాత్తాపపడలేదట. పైగా విజయగర్వం ప్రదర్శించడం అందరినీ విస్మయానికి గురి చేసింది.
పోలీసులు అతనిని శనివారం కోర్టులో హాజరుపరిచారు. ముఖంలో ఎలాంటి పశ్చాత్తాపం లేదట. తెల్లని జైలు దుస్తుల్లో, చేతులకు బేడీలతో బోనులో నిల్చున్నాడు. జడ్జి హత్య అభియోగాలు మోపుతున్నట్టు చెప్పగానే... నిందితుడు తన తలను ఒక్కసారి పైనుంచి కిందకు ఊపి, తన కుడి చేతి బొటన వేలును, చూపుడు వేలును గుండ్రంగా చుట్టి తన అంగీకారం తెలిపాడట. శ్వేత జాతీయులు తమ అధికార దర్పాన్ని లేదా విజయగర్వానికి సంకేతంగా ఈ సంజ్ఞ చేస్తారు.

హత్య అభియోగాలను బట్టి బ్రెంటన్ మరణించే వరకూ జైల్లోనే ఉండాల్సి రావచ్చు. నిందితుడు బెయిల్ అడుగకపోవడంతో పోలీసులు అతడిని మళ్లీ తమ కస్టడీలోకి తీసుకున్నారు. ఈ కేసుపై తదుపరి విచారణను ఏప్రిల్ 5వ తేదీకి వాయిదా వేశారు. తనను తాను ఫాసిస్టుగా ప్రకటించుకున్న నిందితుడు... కోర్టు విచారణ సమయంలో మౌనంగా ఉన్నాడు.
కోర్టు హాలులో నిల్చున్న నిందితుని ముఖాన్ని మీడియాలో ప్రచురించరాదని జడ్జి ఆదేశించారు. నిందితుడు బ్రెంటన్ వయస్సు 28. మారణహోమంలో గాయపడిన వారికి జిల్లా కోర్టుకు సమీపంలోని ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications