భారత్ నుంచి వెళితే నో ఎంట్రీ -ప్రయాణికులపై న్యూజిలాండ్ నిషేధం -11వ తేదీ సా.4 నుంచి అమలు

కొవిడ్-19 విలయనామ సంవత్సరం 2020 రిపీట్ అవుతోందా? అనేంత స్థాయిలో ఈ ఏడాది కూడా కరోనా వైరస్ ఉధృతి మళ్లీ అలజడి రేపుతున్నది. గతేడాది మిగతా దేశాలకంటే ముందుగా వైరస్ వ్యాప్తిని అరికట్టిన ద్వీపదేశం న్యూజిలాండ్ మరోసారి మహమ్మారి దెబ్బను కాచుకునేందుకు సిద్ధమైంది. ప్రస్తుతం కొత్త కేసులు పెరుగుతుండటం, ప్రయాణికుల ద్వారానే వైరస్ వ్యాప్తి చెందుతోన్న దరిమిలా న్యూజిలాండ్ ప్రధాని జెసిండా అర్డెర్న్ సంచలన నిర్ణయం తీసుకున్నారు..

గతేడాది ఎలాగైతే విదేశీ ప్రయాణికుల ద్వారానే వివిధ దేశాల్లో వైరస్ వ్యాప్తి చెందిందో ఆ పొరపాటుకు తావు ఇవ్వకుండా న్యూజిలాండ్ ముందస్తుగా జాగ్రత్తలు తీసుకుంది. భారత్ లో రోజుకు లక్షకుపైగా కొత్త కేసులు వెలుగులోకి చూస్తున్న నేపథ్యంలో ఇక్కడి నుంచి వెళ్లే ప్రయాణికులపై న్యూజిలాండ్ నిషేధం ప్రకటించింది.

New Zealand suspends entry for travellers from India due to high COVID-19 cases

ఈనెల 11వ తేదీ సాయంత్రం 4 గంటల నుంచి ఇండియా నుంచి వచ్చే ప్రయాణికులు ఎవరినీ న్యూజీలాండ్ దేశంలోకి అనుమతించబోమని ఆ దేశ అధికారులు ప్రకటించారు. ఈ నిషేధం కేవలం భారతీయులు లేదా ఇతర దేశస్తులపైనే కాదు, భారత్ నుంచి వచ్చే న్యూజిలాండ్ పౌరులకు కూడా ఈ నిషేధం వర్తిస్తుందని అధికారులు స్పష్టం చేశారు. కాగా,

భారత్ నుంచి ప్రయాణాలను నిషేధించిన న్యూజిలాండ్ ఈ నిర్ణయం తాత్కాలికమైనదని, ఈనెల 11 నుంచి 28వ తేదీ వరకు ప్రయాణికులను అనుమతించబోమని, ఆ తర్వాత పరిస్థితులను బట్టి తదుపరి నిర్ణయం తీసుకుంటామని అధికారులు చెప్పారు. న్యూజిలాండ్ లో తాజాగా వెలుగుచూసిన 23 కరోనా కొత్త కేసుల్లో 17 మంది భారత్ నుంచి ప్రయాణించినవారే కావడంతో అధికారులు ఈ రకమైన నిర్ణయాన్ని తీసుకున్నారు.

న్యూజిలాండ్ లో కొత్తగా నమోదైన 23 కేసులతో కలిపి మొత్తం కేసుల సంఖ్య 2,555కు పెరిగింది. అందులో 2,434 మంది ఇప్పటికే రికవరీ అయ్యారు. యాక్టివ్ కేసుల సంఖ్య 95గా ఉంది. కొవిడ్ కారణంగా ఇప్పటివరకు మొత్తం 26 మంది చనిపోయారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+