Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో భారత సంతతి మహిళ..!!

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు నిక్కీ హేలీ ప్రకటించారు. గతంలో ఐక్యరాజ్యసమితిలో అమెరికా రాయబారిగా, ఆ తరువాత సౌత్ కరోలినా గవర్నర్ గా పనిచేశారు.

వాషింగ్టన్: ఇంకో ఏడాది ఉండగానే.. అగ్రరాజ్యం అమెరికాలో అధ్యక్ష ఎన్నికల వేడి రాజుకునేలా కనిపిస్తోంది. 2024లో జరిగే ఈ ఎన్నికల్లో పోటీ చేయడానికి మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సన్నాహాలు చేస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో సొంత పార్టీ నుంచే ఆయనకు ఎదురుదెబ్బ తగిలింది. ఆయనకు చెక్ పడింది.

రంగంలో నిక్కీ హేలీ..

రంగంలో నిక్కీ హేలీ..

వచ్చే ఏడాది జరగబోయే అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థిగా తాను పోటీ చేయనున్నట్లు నిక్కీ హేలీ ప్రకటించారు. గతంలో ఆమె ఐక్యరాజ్య సమితిలో అమెరికా రాయబారిగా పని చేశారు. అనంతరం రాజకీయాల్లో అడుగు పెట్టారు. రిపబ్లికన్ పార్టీలో చేరారు. సౌత్ కరోలినా గవర్నర్ గా పని చేశారు. రెండు సార్లు ఆమె ఇక్కడి నుంచి ఎన్నికయ్యారు. 2020 నాటి అధ్యక్ష ఎన్నికల్లో ఆమె డొనాల్డ్ ట్రంప్ క్యాంప్ లో విస్తృతంగా పని చేశారు. ఆయన గెలుపు కోసం కృషి చేశారు.

ట్రంప్ సపోర్టర్ గా..

ట్రంప్ సపోర్టర్ గా..

అప్పటి ఎన్నికల్లో.. ఇండియన్ వాయిసెస్ ఫర్ ట్రంప్ పేరుతో ఇండియన్-అమెరియన్లు ఫిలడెల్ఫియాలో ఏర్పాటు చేసిన భారీ ప్రచార సభకు నిక్కీ హేలీ నేతృత్వాన్ని వహించారు. ఇదివరకు ఆమె దక్షిణ కరోలినా నుంచి రెండుసార్లు గవర్నర్‌గా ఎంపికయ్యారు. కేబినెట్‌లో చోటు దక్కించుకున్న మొట్టమొదటి భారత సంతతికి మహిళ ఆమె.

భారత్-పాకిస్తాన్ సంబంధాలపై..

భారత్-పాకిస్తాన్ సంబంధాలపై..

భారత్- పాకిస్తాన్‌ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై నిక్కీ హేలీ అప్పట్లో ప్రచారం చేశారు. డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వ హయాంలో పాకిస్తాన్ కు వ్యతిరేకంగా అమెరికా చేపట్టిన చర్యల గురించి వివరించారు. భారతీయుల ఓట్ల కోసమే ఆమె ఈ అంశాన్ని తెర మీదికి తీసుకొచ్చారంటూ అప్పట్లో డెమొక్రాట్లు విమర్శించినప్పటికీ.. పెద్దగా పట్టించుకోలేదు.

 ఉగ్రవాదంపైనా..

ఉగ్రవాదంపైనా..

ఉగ్రవాదాన్ని అణచివేయడానికి పాకిస్తాన్‌ కు ఇదివరకటి అమెరికన్ ప్రభుత్వాలు పెద్ద ఎత్తున నిధులను మంజూరు చేసేవని, వాటిని ఆ దేశ ప్రభుత్వం భారత్ పై దాడులకు దిగడానికి ఉపయోగించేందంటూ నిక్కీ హేలీ అప్పట్లో ప్రచారం చేశారు. భారత్ సహా అమెరికా సైనికులను తుదముట్టించడానికి ఆ నిధులు పాకిస్తాన్ వినియోగిస్తోందంటూ ఆరోపించారు. తాజాగా 2024లో జరగబోయే అధ్యక్ష ఎన్నికల కోసం స్వయంగా నిక్కీ హేలీ రంగంలో దిగబోతోండటం ప్రాధాన్యతను సంతరించుకుంది.

నిక్కీతో పాటు..

నిక్కీతో పాటు..

కాగా నిక్కీ హేలీతో పాటు ఫ్లోరిడా గవర్నర్ రాన్ డిశాంటోస్, మాజీ ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్, సౌత్ కరోలినాకే చెందిన సెనేటర్ టిమ్ స్కాట్, న్యూ హాంప్‌ షైర్ గవర్నర్ క్రిస్ సునును, అర్కాన్సాస్ మాజీ గవర్నర్ ఆసా హచిన్సన్ తదితరులు రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడానికి ప్రయత్నించే అవకాశాలు లేకపోలేదని అమెరికన్ మీడియా వెల్లడించింది.

పంజాబ్ నుంచి వలస..

పంజాబ్ నుంచి వలస..

నిక్కీ హేలీ భారత సంతతికి చెందిన మహిళ. ఆమె పూర్తి పేరు నిమ్రత నిక్కీ రంధవా. ఆమె పూర్వీకులు పంజాబ్ కు చెందినవారు. అమెరికాకు వలస వెళ్లారు. సౌత్ కరోలినాలోని బంబెర్గ్ లో స్థిరపడ్డారు. ఆమె తండ్రి అజిత్ సింగ్ రంధవా పంజాబ్ అగ్రికల్చర్ యూనివర్శిటీలో ప్రొఫెసర్ గా పని చేశారు. తల్లి రాజ్ కౌర్ రంధవా.. ఢిల్లీ యూనివర్శిటీ పూర్వ విద్యార్థిని.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+