అమెరికా అధ్యక్ష పోటీకి వాల్ స్ట్రీట్ ఎగ్జిక్యూటివ్‌ల ఈవెంట్లో నిధుల సమీకరణకు నిక్కీ హేలి
అమెరికా అధ్యక్ష పోటీకి వాల్ స్ట్రీట్ ఎగ్జిక్యూటివ్‌లు నిర్వహిస్తున్న ఈవెంట్లో నిధుల సమీకరణకు నిక్కీ హేలి హాజరవుతున్నారు.
అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కు షాక్ ఇస్తూ 2024 అధ్యక్ష ఎన్నికల బరిలో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నానని ప్రకటించిన అధ్యక్ష అభ్యర్థి నిక్కీ హేలి దూకుడుగా ముందుకు వెళుతున్నారు. 2024 రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి నిక్కీ హేలీ వాల్ స్ట్రీట్ ఎగ్జిక్యూటివ్ లు నిర్వహిస్తున్న ఈవెంట్లో నిధులు సమీకరణ కోసం హాజరు కానున్నారు.

వాల్ స్ట్రీట్ ఎగ్జిక్యూటివ్ లు నిర్వహిస్తున్న ఈవెంట్లో నిక్కీ హేలి.. హోస్ట్ లు వీరే
వాల్ స్ట్రీట్ ఎగ్జిక్యూటివ్ లు నిర్వహిస్తున్న నిధుల సమీకరణ ఆహ్వానం ఈవెంట్ లో నిక్కీ హేలి పాల్గొంటున్నారు. ఈ ఈవెంట్ హోస్ట్‌లలో ప్రైవేట్ ఈక్విటీ దిగ్గజం టిపిజిలో భాగస్వామి అయిన జోసెఫ్ కొంజెల్‌మాన్ ఉన్నారు. అంతేకాదు ఫైనాన్షియల్ బెహెమోత్ బార్క్లేస్‌లో వైస్ చైర్మన్ గౌతమ్ చావ్లా, టెక్సాస్‌లోని ఆస్టిన్‌లో ప్రధాన కార్యాలయం కలిగిన వెంచర్ క్యాపిటల్ సంస్థను నడుపుతున్న ఇవాన్ బేహర్ తదితరులు పాల్గొననున్నారు. నిధుల సమీకరణ కోసం నిర్వహిస్తున్న ఈవెంట్ కోసం టిక్కెట్ల ధరలు 3,300 డాలర్ల నుండి 6,600 డాలర్ల మధ్య ఉంటాయి.

అమెరికా అధ్యక్ష ఎన్నికల అభ్యర్థిత్వం కోసం డోనాల్డ్ ట్రంప్ తో పోటీ పడుతున్న నిక్కీ హేలి
నిధుల సేకరణ కోసం అధ్యక్ష అభ్యర్థిగా నిక్కి హేలి న్యూయార్క్ కు తొలిగా పర్యటిస్తున్నారు. భారత సంతతికి చెందిన రిపబ్లికన్ పార్టీ నేత నిక్కి హేలి అమెరికా అధ్యక్ష ఎన్నికల అభ్యర్థిత్వం కోసం డోనాల్డ్ ట్రంప్ తో పోటీ పడుతున్నారు. 2024లో జరగనున్న ఎన్నికల కోసం రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించడంలో ఆమె ముందు వరుసలో నిలిచారు.

ఆర్ధిక వనరులను సమకూర్చుకుంటున్న నిక్కీ హేలి
ఫెడరల్ ఎలక్షన్ కమిషన్ ఇటీవల ఇటీవల ప్రచారాలకు దాతలు ఇవ్వగల కొత్త గరిష్ట సహకార పరిమితులను వెల్లడించింది. వారు సాధారణ ఎన్నికలలో 3300 డాలర్ల నుండి 6600 డాలర్ల వరకు విరాళం ఇవ్వచ్చని పేర్కొంది. మాజీ సౌత్ కాలిఫోర్నియా గవర్నర్ 2024 సాధారణ ప్రెసిడెంట్ ఎన్నికలకు మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తో పాటు ఇతర ఉన్నత స్థాయి ప్రత్యర్ధులను ఎదుర్కోవడానికి ఆర్థిక సహాయాన్ని కూడగట్టుకోవాలని లక్ష్యంగా పెట్టుకొని నిధుల సమీకరణకు రంగంలోకి దిగారు.

రిపబ్లికన్ ల మద్దతు నిక్కీ హేలికి ఎంత ఉందో చెప్పిన మార్నింగ్ కన్సల్ట్
51 సంవత్సరాల నిక్కీ హెలి గతంలో సౌత్ కాలిఫోర్నియా గవర్నర్ గా పనిచేశారు. డోనాల్డ్ ట్రంప్ హయాంలో ఐక్యరాజ్యసమితిలో అమెరికా రాయబారిగా సేవలందించారు. సౌత్ కాలిఫోర్నియా గవర్నర్ గా నియమితురాలు అయిన తొలి మహిళగా ఆమె రికార్డు సాధించారు. మార్నింగ్ కన్సల్ట్ యొక్క గ్రాండ్ ఓల్డ్ పార్టీ అయిన రిపబ్లికన్ పార్టీ నిక్కీ హేలికి రిపబ్లికన్ ఓటర్ల నుండి ఆరు శాతం మద్దతు ఉందని పేర్కొంది. ఇక మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కు 50% ఓటర్ల నుండి మద్దతు ఉందని వెల్లడించింది. మొత్తానికి వచ్చే ఎన్నికలలో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగుతానని ప్రకటించుకున్న నిక్కీ హేలి నిధుల సేకరణకు దూకుడుగా ముందుకు వెళుతున్నారు.












Click it and Unblock the Notifications