టెక్కీలకు శుభవార్త: హెచ్ 1 బీ వీసాల జారీలో ఆంక్షల్లేవు

Posted By:
Subscribe to Oneindia Telugu
  H-1B visa : No restrictions says US official హెచ్ 1 బీ వీసాల జారీలో ఆంక్షల్లేవు | Oneindia Telugu

  వాషింగ్టన్: హెచ్ 1 బీ వీసాల జారీ విషయంలో భారతీయులకు అమెరికా శుభవార్తను అందించింది. హెచ్ 1 బీ వీసాలపై ఎలాంటి పరిమితులు, ఆంక్షలు కూడ లేవని అమెరికా అధికారులు ప్రకటించారు.

  అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత హెచ్1 బీ వీసాల జారీలో అనేక ఆంక్షలను విధించింది. వీసా నిబంధనలను మరింత కఠినతరం చేసింది.

  టెక్కీలకు శుభవార్త:హెచ్ 1 బీ వీసాలపై అమెరికాతో మోడీ చర్చలు, ట్రంప్ సానుకూలమే?

  వీసా నిబంధనలను కఠినతరం చేయడం వల్ల ఇండియన్ టెక్కీ కంపెనీలు, ఇండియాకు చెందిన టెక్కీలు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. అయితే అమెరికన్లకు ఉపాధి అవకాశాలను మెరుగుపర్చేందుకుగాను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ నిర్ణయం తీసుకొన్నారని సమాచారం.

  అంతేకాదు హెచ్ 1 బీ వీసాలను దుర్వినియోగం చేయడంలో ఇండియన్లు ముందున్నాని ఓ సమీక్ష సమావేశంలో అమెరికన్ అధికార్లు అభిప్రాయపడ్డారు. ఈ సమీక్ష సమావేశం ప్రధానంగా ఇండియాకు చెందిన కంపెనీలు, టెక్కీలు హెచ్ 1 బీ వీసా ఆధారంగా ఏ రకంగా వ్యవహరిస్తున్నారనే విషయమై చర్చించారు.

  హెచ్ 1 బీ వీసాల జారీలో ఆంక్షలు లేవన్న అమెరికా

  హెచ్ 1 బీ వీసాల జారీలో ఆంక్షలు లేవన్న అమెరికా

  హెచ్ 1 బీ వీసాల జారీల విషయంలో ఇండియన్లు ఇక ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. భారతీయ టెక్కీలకు అమెరికన్ ప్రభుత్వం భారీ ఊరట కల్పించింది. హెచ్ 1 బీ వీసాలను ట్రంప్ సర్కార్ సమీక్షిస్తున్నంత మాత్రాన ఇండియన్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అమెరికా సీనియర్ అధికారి ప్రకటించారు.హెచ్ 1 బీ వీసాల జారీలో ఎలాంటి ఆంక్షలు, పరిమితులు లేవని ఆయన ప్రకటించారు.

  ఇండియన్లకే ఎక్కువగా దక్కిన హెచ్ 1 బీ వీసాలు

  ఇండియన్లకే ఎక్కువగా దక్కిన హెచ్ 1 బీ వీసాలు

  హెచ్ 1 బీ కేటగిరి వీసాల్లో ఎక్కువగా ఇండియన్లకే దక్కాయని అమెరికా సీనియర్ అధికారి ప్రకటించారు. 9 మాసాల్లో 70 శాతం వీసాలు ఇండియన్లకే దక్కాయని ఆయన గుర్తుచేశారు. గత ఏడాది కంటే ఈ ఏడాది ఎక్కువ మందికి వీసాలు దక్కాయని ఆయన అభిప్రాయపడ్డారు. గత ఏడాది 1.2 మిలియన్ల రికార్డును అధిగమించినట్టు ఆయన చెప్పారు.

  ప్రతి ఏటా ఇండియాకు 6 శాతం పెరుగుతున్న వీసాల సంఖ్య

  ప్రతి ఏటా ఇండియాకు 6 శాతం పెరుగుతున్న వీసాల సంఖ్య

  ప్రతి ఏటా ఇండియాకు 6 శాతం వీసాలు అధికంగా ఇండియాకు దక్కుతున్నాయని అమెరికా అధికారులు ప్రకటించారు. హెచ్ 1 బీ, ఎల్ 1(వర్క్ పర్మిట్) వీసాల జారీ 6 శాతం పెరుగుతోందని అమెరికా ప్రకటించింది. ప్రపంచ వలసదారుల వీసా ధరఖాస్తుదారులతో పోలిస్తే చైనా, ఫిలిఫ్పీన్స్, డొమినికన్ రిపబ్లిక్, మెక్సికోల తర్వాత ఆరుశాతం వృద్దితో ఇండియాకు చెందినవారే ఉన్నారని అమెరికా ప్రకటించింది.

  స్టూడెంట్ వీసాల జారీలో రికార్డు

  స్టూడెంట్ వీసాల జారీలో రికార్డు

  2015 సంవత్సరంతో పోలిస్తే స్టూడెంట్స్ వీసాల జారీలో కూడ ఇండియా రికార్డు సాధించింది. గత ఏడాది 88 వేల స్టూడెంట్స్ వీసాలను జారీ చేశారు. అయితే 2015తో పోలిస్తే ఇది 15 శాతం అధికమన్నారు. ప్రస్తుతం 1.8 లక్షల భారతీయ విద్యార్థులు అమెరికాలో ఉన్నారు. చైనా తర్వాత అమెరికాలో ఉన్న విద్యార్థుల్లో ఇండియన్లే ఎక్కువ మంది.

  ఇండియా, అమెరికా మధ్య సెప్టెంబర్ 27న, చర్చలు

  ఇండియా, అమెరికా మధ్య సెప్టెంబర్ 27న, చర్చలు

  ఈ నెల 27వ, తేదిన వాష్టింగన్‌లో ఇండో -అమెరికా ద్వైపాక్షిక సమావేశంలో కేవలం వాణిజ్య, పర్యాటకరంగం అభివృద్ది గురించి చర్చించనున్నారు. కానీ ఎజెండాలో లేనప్పటికి హెచ్ 1 బీ వీసాల ఆంక్షలు, పరిమితులపై చర్చ జరిగే అవకాశం లేకపోలేదని అధికారులు చెప్పారు. దీనికితోడు 7వేలమంది భారతీయులపై ప్రభావం చూపనున్న డ్రీమ్‌పై కూడ చర్చించే అవకాశం ఉందని సమాచారం.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  A senior US official on Thursday sought to allay India's concerns on the H-1B visa programme, which is being "reviewed" by the Trump administration, saying there are no "restrictions" in place.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి