Nobel Prize 2022 in Physics: క్వాంటమ్‌పై లోతుగా పరిశోధన - ముగ్గురికి అవార్డ్
స్టాక్‌హోమ్: వేర్వేరు రంగాలకు చెందిన శాస్త్రేవేత్తలు, ఆర్థికవేత్తలు, ఇతర సామాజిక ఉద్యమకారులకు ప్రతి సంవత్సరం అందించే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన నోబెల్ బహుమతుల సందడి మొదలైంది. ఆర్థికం, వైద్యం, సామాజిక అంశాలు, పర్యావరణం, ఫిజిక్స్.. ఇలా విభిన్న రంగాల్లో నూతన ఒరవడిని సృష్టించిన, వాటికి ఆద్యులైన శాస్తవేత్తలకు అందించే ఈ అవార్డుల ప్రకటన పరంపర సోమవారం ఆరంభమైంది. వారం రోజుల పాటు ఈ అవార్డుల ప్రకటన కొనసాగుతుంది.
ఇప్పటికే మెడిసిన్‌కు సంబంధించిన అవార్డును ప్రకటించారు. మెడిసిన్‌లో అద్భుతాలను ఆవిష్కరించిన స్వీడన్‌కు చెందిన జన్యు శాస్త్రవేత్త స్వాంటె పాబొను ఈ ఏడాది నోబెల్ బహుమతి వరించింది. మెడిసిన్‌కు సంబంధించిన నోబెల్ ప్రైజ్ కోసం పాబొ పేరును ఎంపిక చేసినట్లు జ్యూరీ కమిటీ ప్రకటించింది. ఈ మేరకు స్వీడన్‌లోని స్టాక్‌హోమ్‌లో గల కరోలిన్‌స్కా ఇన్‌స్టిట్యూట్‌లో ఏర్పాటు చేసిన సమావేశం సందర్భంగా నోబెల్ కమిటీ కార్యదర్శి థామస్ పెర్ల్‌మాన్ ఆయన పేరును ప్రకటించారు.

ఇవ్వాళ ఫిజిక్స్‌లో నోబెల్ బహుమతికి ఎంపికైన శాస్త్రవేత్తల పేర్లను వెల్లడించారు. ముగ్గురికి ఉమ్మడిగా ఈ అవార్డు వరించింది. అలెన్ ఆస్పెక్ట్స్, జాన్ ఎఫ్.క్లాసర్, ఆంటోన్ జీలింగర్‌కు జాయింట్‌గా ఫిజిక్స్‌లో నోబెల్ ప్రైజ్‌ను ప్రకటించారు. ఈ ముగ్గురు చేసిన ఆవిష్కరణలు క్వాంటమ్ ఆఫ్ టెక్నాలజీలో కొత్త శకానికి పునాది వేసిందని, అణువు స్థితులు, వాటి లక్షణాల సంబంధించిన వాల్యూమ్స్‌ను సమూలంగా మార్చేయ గలగడం సాధ్యమౌతుందని కమిటీ తెలిపింది.
1947లో ఫ్రాన్స్‌లోని ఏజెన్‌లో అలెన్ జన్మించారు. 1983లో ఓర్సెలోని పారిస్-సుడ్ యూనివర్శిటీలో పీహెచ్‌డీ పూర్తి చేశారు. యూనివర్శిటీ పారిస్-సాక్లే అండ్ ఎకోల్ పాలిటెక్నిక్‌లో ప్రొఫెసర్‌గా పని చేశారు. జాన్ ఎఫ్. క్లాజర్ భౌతిక శాస్త్రవేత్త. అమెరికాకు చెందిన క్లాజర్- క్వాంటమ్ ఇన్ఫర్మేషన్ సైన్స్‌లో నిష్ణాతుడు. కాలిఫోర్నియా పసడెనాలో జన్మించారు. కాలిఫోర్నియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఫిజిక్స్‌లో బీఎస్ పూర్తి చేశారు.
ఆంటోన్ జైలింగర్ ఆస్ట్రియా దేశస్థుడు. వియన్నా విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా పనిచేశారు. ప్రతిష్ఠాత్మక మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో విజిటింగ్ ప్రొఫెసర్‌గా పనిచేశారు. ఈ ముగ్గురూ అణువులపై లోతుగా పరిశోధనలు చేశారు. అణువు, దాని విచ్ఛిన్నం, క్వాంటమ్ మెకానిజం, వాటి ప్రభావాలపై సమగ్రంగా అధ్యయనం చేశారు.
-
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్‌ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
పాకిస్థాన్ లోనే ఫాస్టెస్ట్ ట్రైన్ ఇదేనట.. స్పీడ్ చూస్తే మాత్రం.. మన ప్యాసింజర్ ట్రైన్స్ నయం..! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!!












Click it and Unblock the Notifications