భవిష్యత్‌లో రేడియో ధార్మిక సునామీ- సరికొత్త ఉపద్రవాన్ని సృష్టించిన కిమ్‌ జొంగ్

ప్యాంగ్యాంగ్: ఆధునిక నియంతగా ప్రపంచ దేశాల్లో గుర్తింపు తెచ్చుకున్న ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జొంగ్ ఉన్‌.. మరో సరికొత్త ఉపద్రవానికి కారణం అయ్యారు. ఇప్పటికే వరుసగా అణ్వాయుధాలను పరీక్షిస్తూ పొరుగునే ఉన్న దక్షిణ కొరియా, జపాన్ కు కంటి మీద కునుకు లేకుండా చేస్తోన్న ఆయన- ఇక కొత్తగా మరో సంచలనానికి తెర తీశారు. ఎప్పటికైనా మానవాళికి ప్రమాదకరంగా పరిణమించే అణ్వస్త్రాలను సృష్టించారు.

అణ్వాయుధ పరీక్షలపై అగ్రరాజ్యం అమెరికా ఆంక్షలను విధించినప్పటికీ- ఉత్తర కొరియా ఏ మాత్రం వాటిని లెక్కచేయట్లేదు. ఇప్పటివరకు సముద్రాల్లో సంభవించే పెను భూకంపాల వల్ల ఏర్పడే సునామీని చూశాం. తాజాగా కృత్రిమ సునామీని సృష్టించే సామర్థ్యం గల డ్రోన్లు, అణ్వాయుధాలను తయారు చేసింది ఉత్తర కొరియా. అది కూడా రేడియో ధార్మిక శక్తి గల సునామీని సృష్టించే సామర్థ్యం గల డ్రోన్లు కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. దీన్ని ఉత్తర కొరియా విజయవంతంగా పరీక్షించింది కూడా.

 North Korea has tested a nuclear capable underwater attack drone, it can generate a radioactive tsunami.

కిమ్ జొంగ్ ఉన్ స్వయంగా ఈ పరీక్షలను పర్యవేక్షించారు. పరీక్ష సమయంలో ఈ అండర్ వాటర్ న్యూక్లియర్ డ్రోన్ 80 నుంచి 150 మీటర్ల లోతులో సంచరించింది. 59 గంటలకు పైగా నీటి అడుగున ప్రయాణించింది. నిర్దేశిత గడువు ముగిసిన అనంతరం ఈ డ్రోన్- ఉత్తర కొరియా తూర్పు తీరంలో గల హంగ్యాంగ్ సమీపంలో సముద్ర జలాల్లో పేలిపోయింది. ఈ ప్రయోగానికి సంబంధించిన వివరాలన్నింటినీ కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది.

శతృదేశాలకు చెందిన యుద్ధనౌకలు, ఓడరేవులను రేడియో ధార్మిక సునామీలను సృష్టించడం ద్వారా నాశనం చేసే సామర్థ్యాలు గల న్యూక్లియర్ డ్రోన్లను ఉత్తర కొరియా విజయవంతంగా పరీక్షించినట్లు కేసీఎన్ఏ తెలిపింది. అండర్ వాటర్ న్యూక్లియర్ డ్రోన్‌ పరీక్షలను కిమ్ జొంగ్ స్వయంగా పర్యవేక్షించినట్లు స్పష్టం చేసింది. ఆ సమయంలో ఆయన కుమార్తె కూడా అక్కడే ఉన్నట్లు పేర్కొంది. ఇప్పటివరకు ఉత్తర కొరియా అత్యంత శక్తిమంతమైన క్షిపణి హ్వాసాంగ్- 17 పరీక్షలను విజయవంతంగా ప్రయోగించిన విషయం తెలిసిందే.

ఇది ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి. ఇప్పుడు తాజాగా అండర్ వాటర్ న్యూక్లియర్ డ్రోన్లను ప్రయోగించడం ప్రపంచదేశాలను ఉలిక్కిపడేలా చేస్తోంది. దీనిపై అమెరికా ఇంకా స్పందించాల్సి ఉంది. అటు దక్షిణ కొరియా, జపాన్ ఈ ప్రయోగాన్ని తప్పుపట్టాయి. ఉద్దేశపూరకంగానే ఉత్తర కొరియా రెచ్చగొట్టే ధోరణిలో ఉందని ఆరోపించాయి. ఐసీబీఎం వంటి న్యూక్లియర్ మిస్సైల్ పరీక్షలపై తాము పలుమార్లు అభ్యంతరాన్ని వ్యక్తం చేశామని, అయినప్పటికీ వినిపించుకోట్లేదని పేర్కొన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+