Kim Jong Un, Putin: పుతిన్‍తో కిమ్ జోంగ్ ఉన్ భేటీ.. ఆయుధ ఒప్పందం చేసుకున్నారా..!

రష్యా పర్యటనలో ఉన్న ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ రష్యా అధ్యక్షుడు పుతిన్ తో సమావేశమయ్యారు. ఈ భేటీ దాదాపు 5 గంటల పాటు జరిగినట్లు సమాచారం. కాగా పుతిన్ తమ దేశానికి రావాల్సింది కిమ్ జోంగ్ ఉన్ ఆహ్వానించిన ప్యోంగ్యాంగ్ ప్రభుత్వ మీడియా KCNA (కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ) నివేదించింది. పుతిన్, కిమ్ ఆహ్వానాన్ని అంగీకరించారు. ఆయన త్వరలో ఉత్తర కొరియాలో పర్యటించే అవకాశం ఉంది. పశ్చిమ దేశాల ఆంక్షాలతో ఒంటిగా ఉన్న ఉత్తర కొరియా రష్యాకు బేషరతు మద్దతు తెలిపింది.

పుతిన్, కిమ్ భేటీ పలు కీలక విషయాలు చర్చినట్లు తెలిసింది. కాగా ఈ సమావేశం రష్యా తూర్పు ప్రాంతంలోని లాంచ్‌ ప్యాడ్‌ అయిన వోస్తోని కాస్మోడ్రోమ్‌ వద్ద జరిగినట్లు స్థానిక మీడియా పేర్కొంది. కిమ్ ఉక్రెయిన్‌లో యుద్ధం గురించి పరోక్షంగా కానీ స్పష్టంగా ప్రస్తావిస్తూ.. రష్యా ప్రస్తుతం తన సార్వభౌమాధికారం, భద్రత, ప్రయోజనాలను కాపాడుకోవడానికి ఆధిపత్య శక్తులకు వ్యతిరేకంగా న్యాయమైన పోరాటంలో నిమగ్నమై ఉంది అని కిమ్ స్పష్టం చేశారు. డెమొక్రాటిక్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా ఎల్లప్పుడూ రష్యా ప్రభుత్వం తీసుకున్న అన్ని చర్యలకు పూర్తి మద్దతు తెలుపుతుందని పేర్కొన్నారు.

North Korean President Kim Jong Un met Russian President Putin

సామ్రాజ్యవాద వ్యతిరేకంగా తాము ఎల్లప్పుడూ రష్యాతో కలిసి ఉంటామని కిమ్ పునరుద్ఘాటించారు. నాలుగు గంటలకు పైగా కొనసాగిన ఇద్దరు నేతల సమావేశంలో ఆయన పలు అంశాలు చర్చించినట్లు బ్లూమ్‌బెర్గ్ నివేదించింది. "సైనిక బెదిరింపులు, కవ్వింపులు, సామ్రాజ్యవాదుల దౌర్జన్యం" నేపథ్యంలో వ్యూహాత్మక సహకారాన్ని మరింత పటిష్టం చేసుకోవడానికి ఇరుపక్షాలు అంగీకరించాయి. అయితే ఇరు దేశాల మధ్య ఆయుధాల కొనుగోలు సంబంధించి ఒప్పంద జరిగినట్లు ఎలాంటి సమాచారం లేదు.

ఉక్రెయిన్‌లో యుద్ధం మధ్య ఉత్తర కొరియా రష్యాకు ఆయుధాలు, మందుగుండు సామగ్రిని అందించగలదని యునైటెడ్ స్టేట్స్, దక్షిణ కొరియా అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. ఉక్రెయిన్ తో యుద్ధం కారణంగా రష్యా అనేక ఆయుధాలను ఉపయోగించాల్సి వచ్చింది. దీంతో రష్యా వద్ద ఆయుధాల కొరత ఏర్పడింది. దీంతో ఉత్తర కొరియా రష్యా ఆయుధాలు కొనుకోలు చెయ్యొచ్చని భావిస్తున్నారు. అటు ఉత్తర కొరియా కూడా ఆయుధాలు అమ్మడానికి ప్రయత్నాలు చేస్తుంది. వచ్చిన డబ్బుతో ఆహారం, అధునాత ఆయుధాల తయారీకి ఉపయోగించుకోవాలని చూస్తుంది. కిమ్ అందుకే రష్యా పర్యటకు వచ్చినట్లు తెలుస్తోంది.

పుతిన్, కిమ్ సైనిక సహకారం గురించి చర్చించారు, కానీ వివరాలను వెల్లడించలేదు. మాస్కో, ప్యోంగ్యాంగ్ ఆయుధ కొనుగోలు లాంటి ఒప్పందలు లేవని స్పష్టం చేశాయి. మాస్కో, ఉత్తర కొరియా ఏదైనా కొత్త ఆయుధ ఒప్పందాలను కుదుర్చుకుంటే, వాటిపై అదనపు ఆంక్షలు విధించడానికి బిడెన్ సర్కార్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. "యూఎన్. భద్రతా మండలి తీర్మానాన్ని ఉల్లంఘించే కార్యక్రమాలపై ఉత్తర కొరియాతో రష్యా సహకారం గురించి మాట్లాడటం ఇబ్బందికరంగా ఉంది" అని యుఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+