యూఎస్ అధ్యక్ష ఎన్నికలే కాదు .. అమెరికాలో తాజాగా మరో కొత్త రికార్డ్

ఒకపక్క అమెరికా అధ్యక్ష ఎన్నికలలో ట్రంప్ ఓటమి, జో బైడెన్ గెలుపుతో రికార్డులు బద్దలవుతుంటే మరొకపక్క అత్యంత ఆందోళనకరమైన రికార్డులు సృష్టిస్తుంది యూఎస్ .యునైటెడ్ స్టేట్స్ శుక్రవారం 128,000 కన్నా ఎక్కువ కొత్త కరోనావైరస్ కేసులను నమోదు చెయ్యటం ఆందోళన కలిగిస్తుంది . దేశవ్యాప్తంగా మరణాల సంఖ్య వరుసగా నాలుగవ రోజు 1,000 దాటింది. నిత్యం వెయ్యికి పైగా మరణాల నమోదు ఆందోళనకరంగా మారింది.

యూఎస్ లో వారం రోజుల్లో దాదాపు లక్ష కేసులు

యూఎస్ లో వారం రోజుల్లో దాదాపు లక్ష కేసులు

కొత్త కేసుల ఏడు రోజుల సగటు దాదాపు 100,000 ఉన్నట్టు తెలుస్తుంది . కరోనా మహమ్మారి యూఎస్ లోని అన్ని ప్రాంతాలలో దాడి చేస్తుంది . న్యూ ఇంగ్లాండ్, మిడ్‌వెస్ట్, గ్రేట్ ప్లెయిన్స్ మరియు పసిఫిక్ నార్త్‌వెస్ట్‌లో విస్తరించి ఉన్న ఇరవై రాష్ట్రాలు ఒక్కసారిగా కేసుల పెరుగుదలను నమోదు చేశాయి. గత వారంలో అత్యధిక పెరుగుదలను చూసిన ప్రాంతాలలో మైనే, అయోవా, కొలరాడో, మిన్నెసోటా మరియు నెబ్రాస్కా ఉన్నాయి.

ప్రధాన రాష్ట్రాల్లో పంజా విసురుతున్న కరోనా మహమ్మారి

ప్రధాన రాష్ట్రాల్లో పంజా విసురుతున్న కరోనా మహమ్మారి

ఇల్లినాయిస్ కూడా శుక్రవారం ఈ జాబితాలో చేరింది. భారీగా కేసులను నమోదు చేసింది. ఇప్పుడు ఐదు రాష్ట్రాలు ఒక రోజులో 10,000 కి పైగా కొత్త కరోనావైరస్ కేసులను నమోదు చేశాయి. ఫ్లోరిడా, కాలిఫోర్నియా, న్యూయార్క్ మరియు టెక్సాస్ కూడా కరోనా కేసుల తీవ్రతతో ఇబ్బందిపడుతున్నాయి. ఉత్తర డకోటాలో ఒకే రోజులో నివేదించబడిన కొత్త కేసులు మరియు మరణాల సంఖ్యతో పాటు ఆసుపత్రిలో చేరిన కరోనావైరస్ రోగుల సంఖ్య రికార్డులను బద్దలుకొట్టింది.

 శీతాకాలంలో కరోనా పెరిగే అవకాశం ఉందన్న నిపుణులు

శీతాకాలంలో కరోనా పెరిగే అవకాశం ఉందన్న నిపుణులు

సెప్టెంబరు మధ్యలో కేసులు పెరగడం మొదలుపెట్టినప్పటి నుండి, రాష్ట్రాలు కరోనా ఆంక్షలను ప్రవేశపెట్టాయి. కాని ఎన్నికల కారణంగా పెద్ద ఎత్తున చర్యలకు దూరంగా ఉన్నాయి. ఎన్నికల వేళ విపరీతంగా కరోనా కేసులు పెరుగుతున్నా అధ్యక్ష ఎన్నికల ఉత్కంఠ నేపధ్యంలో ప్రభుత్వం చర్యలకు దూరంగా ఉంది. ప్రపంచంలోనే అత్యధికంగా కరోనా కేసులు , కరోనా మరణాలు నమోదైన దేశంగా యూఎస్ ఉంది. తాజాగా యూఎస్ లో శీతాకాలం మొదలైనప్పటి నుండి కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది.

రానున్న కొత్త ప్రభుత్వానికి పెను సవాల్ విసురుతున్న కరోనా

రానున్న కొత్త ప్రభుత్వానికి పెను సవాల్ విసురుతున్న కరోనా


మొత్తంగా ఇప్పటివరకు 97 లక్షల పైచిలుకు కరోనా కేసులు నమోదు కాగా, 2,36,000 మంది మరణించినట్లుగా సమాచారం. శీతాకాల ప్రభావం ఎక్కువ అవుతుండటంతో కేసులు మరింత పెరిగే అవకాశముందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు
. యూఎస్ లో ఎన్నికల రికార్డులే కాకుండా కరోనా కూడా కొత్త రికార్డులతో రానున్న ప్రభుత్వానికి పెను సవాల్ విసురుతుంది .

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+