ఫేస్‌బుక్ స్కామ్‌లో మీ డేటా ఉందా?: తెలుసుకునే ఛాన్స్, జుకర్ బర్గ్‌కు 4 ప్రశ్నలు
వాషింగ్టన్: ఫేస్‌బుక్ డేటా లీకేజీపై ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. 'కేంబ్రిడ్జి అనలిటికా' ఉదంతం వెలుగుచూడటంతో.. ఫేస్‌బుక్‌లో వ్యక్తిగత సమాచారానికి భద్రత ఉందా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ నేపథ్యంలో 'కేంబ్రిడ్జి అనలిటికా'లో ఎవరి సమాచారం అయితే షేర్ అయిందో.. దాన్ని తెలుసుకునే అవకాశం కలిగింది. డేటా లీక్ అయినట్టుగా తెలుస్తున్న 87మిలియన్ల ఫేస్‌బుక్ యూజర్స్ 'న్యూస్ ఫీడ్'లో ఈరోజు నుంచే ఆ సమాచారాన్ని తెలుసుకోవచ్చు.

'ప్రొటెక్టింగ్ యువర్ ఇన్ఫర్మేషన్'
కేంబ్రిడ్జి అనలిటికా ఉదంతంలో లీకైనా డేటాకు సంబంధించి.. దాదాపు 70శాతం మంది యూజర్స్ ఫిలిప్పీన్స్, ఇండోనేషియా, యూకె నుంచి ఉన్నట్టు ఫేస్ బుక్ తెలిపింది.
ఇకనుంచి ప్రపంచవ్యాప్తంగా ఉన్న2.2బిలియన్ల ఫేస్‌బుక్ యూజర్స్ అందరికీ 'ప్రొటెక్టింగ్ యువర్ ఇన్ఫర్మేషన్'('సమాచారాన్ని భద్రంగా ఉంచుకోండి) పేరిట ఒక నోటీస్ వస్తుందని చెప్పింది.

యాప్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు..
ఆ నోటీసులోనే ఒక లింకు కూడా కనిపిస్తుందని, అందులో మనం వాడుతున్న యాప్స్.. ఏ యాప్ ద్వారా ఎలాంటి సమాచారాన్ని షేర్ చేస్తున్నాం వంటి వివరాలన్ని ఉంటాయని తెలిపింది. ఒకవేళ ఏదైనా యాప్‌ను తొలగించాలనుకున్నా.. లేక మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా చేయాలనుకున్నా.. దానికి అందులో వెసులుబాటు ఉంటుందని పేర్కొంది.

సెనేట్ ముందుకు జుకర్ బర్గ్..
డేటా స్కాండల్ ఆరోపణల నేపథ్యంలో.. ఫేస్‌బుక్ సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్, అమెరికా కాంగ్రెస్ ప్రశ్నలను ఎదుర్కోబోతున్నారు. సెనేట్ జ్యుడిషియరీ, కామర్స్ కమిటీలు జుకర్‌బర్గ్‌ను మంగళవారం ప్రశ్నించనున్నారు.
అమెరికా ఎన్నికల్లో ట్రంప్ గెలుపుకు ఫేస్ బుక్ డేటా స్కాండల్ పరోక్షంగా సహకరించిందన్న ఆరోపణల నేపథ్యంలో.. భవిష్యత్తు ప్రణాళికలపై జుకర్‌బర్గ్ నుంచి సెనేట్ కొన్ని నిర్దిష్టమైన వాగ్దానాలు తీసుకోనుంది.

వీటికి సమాధానం చెప్పాల్సిందే..:
2015 నుంచే కేంబ్రిడ్జ్ అనలిటికాకు యూజర్ల డేటాను షేర్ చేస్తున్నట్టు ఒప్పుకున్న ఫేస్‌బుక్... ఈ విషయాన్ని అప్పుడే ఎందుకు ప్రజలకు చెప్పలేదు?
ఫేస్‌బుక్ లాంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ నుంచి అమెరికన్ యూజర్ల వ్యక్తిగత సమాచారాన్ని సేకరించడానికి.. ఆ కంపెనీలకు ఉన్న అవసరమేంటి?
ఫేస్‌బుక్ యూజర్లకు భవిష్యత్తులో యాజమాన్యం ఎలాంటి భరోసా కల్పిస్తుంది?
పొలిటికల్ పోలరైజేషన్ ను తగ్గించడానికి ఫేస్‌బుక్ ఎలా సహాయపడుతుంది? వంటి ప్రశ్నలను సెనేట్ నుంచి జుకర్ బర్గ్ ఎదుర్కోనున్నారు.
-
ట్రంప్‌కు తలనొప్పి.. పుతిన్‌కు పండగ!: భారత్, చైనాకు రష్యానే దిక్కు! -
ఇరాన్ జీవనాడిపై అమెరికా దెబ్బ- ఓటమిని అంగీకరించిందని ట్రంప్ ప్రకటన -
ఏడడుగులు వేయబోతున్న స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి.. పెళ్లి కొడుకు ఫిక్స్ ?? -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్












Click it and Unblock the Notifications