"ఒక్కరాత్రి నాతో గడుపు... ఎంత డబ్బు కావాలో అడుగు"

2015 ప్రపంచ సుందరి పోటీల్లో కూడా పాల్గొన్న నటాషా సింగపూర్ వెళ్ళినప్పుడు ఓ మహిళ ఆమె వద్దకు వచ్చి తనకు తెలిసిన బడా పారిశ్రామికవేత్తతో ఒక్క రాత్రి గడిపితే భారీగా డబ్బు ఇప్పిస్తానని ఆఫర్ ఇచ్చిందట.

సింగపూర్: సింగపూర్, మలేసియా దేశాలలో బాగా సంపన్నులు ఉంటారని పేరు. అందుకు ఏమాత్రం తీసిపోని రీతిలోనే వార్తలు కూడా వినవస్తుంటాయి. ఇక హైక్లాస్ ప్రొఫెషనల్స్, సెలబ్రిటీల గురించయితే చెప్పనక్కర్లేదు. ఎన్నెన్నో రూమర్లు, మరెన్నో సంచలన వార్తలు.

అయితే ఈ కథనం పూర్తిగా నిజం. మిస్ మాంటేనిగ్రో 2015 సుందరి నటాషాకు ఎదురైన అనుభవమిది. 2015 ప్రపంచ సుందరి పోటీల్లో కూడా పాల్గొన్న నటాషా సింగపూర్ వెళ్ళినప్పుడు ఓ మహిళ ఆమె వద్దకు వచ్చి తనకు తెలిసిన బడా పారిశ్రామికవేత్తతో ఒక్క రాత్రి గడిపితే భారీగా డబ్బు ఇప్పిస్తానని ఆఫర్ ఇచ్చిందట.

'offers of cash bribes to become a prostitute'

అంతేకాదు, పిలిచినప్పుడల్లా వెళ్లి కొంతమంది ప్రయివేటు క్లయింట్లతో గడపాలని, అందుకు ఏం కావాలో అడగమని నేరుగా ఆఫర్ ఇచ్చినట్లు నటాషా చెప్పింది. ఇలాంటి ఆఫర్లు విని తొలుత నిర్ఘాంతపోయిన నటాషా వీళ్ళని ఇలా వదిలితే లాభం లేదనుకుని నేరుగా సోషల్ మీడియా ద్వారా.. తనకు అలాంటివి ఇష్టం లేదనీ, ఇంకెప్పుడూ ఇలాంటి అభ్యర్థనలు చేయవద్దని ఘాటుగా బదులిచ్చిందట.

అయినా కూడా సదరు వ్యక్తి నుంచి మళ్ళీ 'నువ్వు కోరుకున్నంత డబ్బు ఇస్తాను.. ఇష్టమేనా..?' అంటూ సందేశం వచ్చిందట. దాంతో తాను షాక్ కు గురయ్యానని, మరోసారి ఘాటుగా బదులిచ్చానని వెల్లడించింది నటాషా.

విచిత్రం ఏమిటంటే.. ఈ రకమైన ఆఫర్ల గురించి సోషల్ మీడియాలో నటాషా పోస్ట్ చేసిన తరువాత.. ఆమెకు మద్దతుగా "అవును.. నాకూ సదరు వ్యక్తి నుంచి ఇలాంటి ఆఫర్ మెసేజ్ లు వచ్చాయి.." అంటూ మిస్ క్రొయేషియా 2015 మజా స్పాహిజా కూడా పేర్కొనడం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+