షాకింగ్: చిన్న బ్రెడ్డు ముక్క దొంగిలించిందని.. బలవంతంగా మద్యం తాగించి, సజీవంగా కాల్చి...
చైనాకు చెందిన షీ అనే వ్యక్తి ఒకరోజు తన ఇంట్లోంచి ఓ ఎలుక చిన్న బ్రెడ్డు ముక్క దొంగిలించడం గమనించాడు. దీంతో అతడికి కోపం వచ్చింది. ‘ఓహో.. నువ్వు నా బ్రెడ్డు తింటావా.. ఇప్పుడు చూడు నిన్నేం చేస్తానో..’
బీజింగ్: చిన్న బ్రెడ్డు ముక్క దొంగిలించిన పాపానికి పెద్ద శిక్షే విధించాడు ఓ వ్యక్తి. అతడు శిక్ష విధించింది కూడా మనిషికి కాదు, ఓ మూగజీవానికి, అందులోనూ ఓ చిన్న ఎలుకకు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. ఈ ఘటన గురువారం వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెళితే.. చైనాకు చెందిన షీ అనే వ్యక్తి ఒకరోజు తన ఇంట్లోంచి ఓ ఎలుక చిన్న బ్రెడ్డు ముక్క దొంగిలించడం గమనించాడు. దీంతో అతడికి కోపం వచ్చింది. 'ఓహో.. నువ్వు నా బ్రెడ్డు తింటావా.. ఇప్పుడు చూడు నిన్నేం చేస్తానో..' అంటూ ఎలాగైతేనేం ఆ ఎలుకను పట్టుకున్నాడు.
ఆ తరువాత దానికి బలవంతంగా బైజియు అనే బ్రాండ్ మద్యం తాగించాడు. ఆపైన పాపం దాన్ని మంటపై ఉంచి బతికుండాగానే మంటలో కాల్చాడు. ''చూడు చూడు.. బ్రెడ్డు తిన్నావు.. వైన్ తాగావు.. ఇప్పుడు మంట వేడిని కూడా అనుభవించు..'' అంటూ తనలోని క్రూరత్వాన్ని బయటపెట్టాడు.
అంతేకాదు, దీనినంతటినీ తన మొబైల్ ఫోన్ లో వీడియో తీసి దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. క్రూరంగా మనుషులను చంపిన వాళ్ల గురించి విన్నాం.. చూశాంగానీ.. ఇదేంటి? మూగ జీవాన్ని కూడా ఇంతటి చిత్ర హింసకు గురిచేస్తారా? ఉంటారు మరి ఇలాంటి వాళ్లు కూడా, వీడియో చూసి నమ్మక తప్పదు.
-
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్‌కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి












Click it and Unblock the Notifications