Video: గాల్లో చిగురుటాకులా వణికిన విమానం-ఒకరి మృతి, 30 మందికి గాయాలు..!

సింగపూర్ ఎయిర్ లైన్స్ కు చెందిన ఓ అంతర్జాతీయ సర్వీస్ విమానం ఇవాళ గాల్లో ప్రయాణిస్తుండగా తీవ్ర కుదుపులకు లోనైంది. లండన్ లోని హీత్రూ విమానాశ్రయం నుంచి బయలుదేరిన ఈ బోయింగ్ 777 విమానం మార్గ మధ్యలో తీవ్ర కుదుపులకు లోనైంది. దీంతో అందులో ప్రయాణిస్తున్న వారు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. తేరుకునే లోపు అందులో ఒకరు చనిపోయారు. మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు.

one dead and 30 injured in london-Singapore flight due to severe turbulence diverted to bangkok

లండన్ నుంచి బయలుదేరిన సింగపూర్ ఎయిర్ లైన్స్ బోయింగ్ విమానం దాదాపు 6 వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తుండగా.. గాలి ఒత్తిడి కారణంగా ఒక్కసారిగా తీవ్ర కుదుపులకు లోనైంది. దీంతో విమాన సిబ్బంది సైతం ప్రయాణికులను అప్రమత్తం చేసే వీలు లేకపోయింది. ఆ కుదుపులకు విమానంలో ఉన్న లగేజీ కూడా ప్రయాణికులపై వచ్చి పడింది. దీంతో వారంతా ఒక్కసారిగా హాహాకారాలు చేశారు. ఏం జరిగిందో తెలుసుకునే లోపే ఒకరు చనిపోయారు. పలువురు గాయపడ్డారు.

గాల్లో విమానం కుదుపుల ఘటనపై సింగపూర్ ఎయిర్ లైన్స్ ఓ ప్రకటన చేసింది. ఇవాళ లండన్ నుంచి సింగపూర్ వెళ్తున్న తమ విమానం తీవ్ర కుదుపులకు లోనైందని, ఇందులో చనిపోయిన ప్రయాణికుడి కుటుంబానికి సంతాపం తెలిపింది. అలాగే గాయపడిన వారి కుటుంబాలకు అత్యవసర చికిత్స అందిస్తున్నట్లు తెలిపింది. అయితే ఈ ఘటన తర్వాత సింగపూర్ విమానాన్ని అత్యవసరంగా బ్యాంకాక్ లోని సువర్ణభూమి అంతర్జాతీయ విమానాశ్రయానికి మళ్లించారు. అక్కడ చనిపోయిన ప్రయాణికుడిని దించేచి, మిగిలిన వారికి చికిత్స అందిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+