షాక్ : కండోమ్ లో మొబైల్ ను మోసుకొచ్చిన పావురం (వీడియో)
కొలంబియా : పూర్వం పావురాలతో సందేశాలు పంపించుకునేవారన్న విషయం వినే ఉంటాం. మొబైల్స్ లాంటి అత్యాధునిక టెక్నాలజీ వచ్చాక.. ఉత్తరాలు కూడా మూలకు పడిపోయిన పరిస్థితి. అయితే.. మొబైల్ నిషిద్దమైన ఓ చోట పావురమే మొబైల్ తో ప్రత్యక్షమైతే!
కొలంబియాలోని కాంబిటా జైలు ప్రాంగణంలో ఇదే జరిగింది. అగంతకులు ఏమాత్రం చొరబడడానికి వీలు లేకుండా ఉండే కాంబిటా జైలులోకి ఓ పావురం ఎగిరొచ్చింది. అది మామూలు పావురమే అయితే ఈ చర్చంతా ఉండకపోయేది. కానీ.. దాని వీపున ఓ మొబైల్ ఫోన్ ను, పెన్ డ్రైవ్ ను మోసుకుని జైళ్లో వాలిపోయింది పావురం. ఏ ఖైదీకి సహాయం చేయడానికి ఎవరో పంపించారో తెలియదు గానీ మొత్తానికి ఆ పావురం సెక్యూరిటీ కంటపడింది.

అయితే దగ్గరికెళ్లి.. పావురాన్ని పరిశీలించిన అధికారులు ఒకింత ఆశ్చర్యానికి లోనయ్యారు. ఎందుకంటే.. ఆ పావురం మోసుకొచ్చిన మొబైల్ ఫోన్ ను ఓ కండోమ్ ప్యాక్ లో పెట్టి పంపించారు. అనంతరం ఆ మొబైల్ ను, పెన్ డ్రైవ్ ను పరిశీలన నిమిత్తం ల్యాబ్ కు పంపించినట్లు సమాచారం. ఇక పావురంతో రాయబారం జరుపుతోన్న వాళ్లను పట్టుకునే పనిలో పడ్డారు పోలీసులు.












Click it and Unblock the Notifications