మాల్దీవుల్లో ఇద్దరు జర్నలిస్టుల అరెస్టు: ఒకతను ఇండియన్

Written By:
Subscribe to Oneindia Telugu

మాలే: అత్యవసర పరిస్థితి అమలవుతున్న నేపథ్యంలో దేశ భద్రత పేరు చెప్పి మాల్డీవుల్లో ఇద్దరు జర్నలిస్టులను అరెస్టు చేశారు. వారిలో ఒకతను భారతీయుడు కాగా, మరొకతను భారత సంతతికి చెందిన బ్రిటిష్ జాతీయుడు.

పంజాబ్‌కు చెందిన మనీ శర్మ, లండన్‌కు చెందిన అతీష్ రావ్జీ పటేల్ ఎఎఫ్‌పి న్యూస్ ఏజెన్సీకి రిపోర్టర్లుగా పనిచేస్తున్నారు. జర్నలిస్టుల అరెస్టుపై జాయింట్ అపోజిషన్ అధికార ప్రతినిధి అహ్మద్ మహ్లూఫ్ స్పందించారు.మాల్దీవుల్లో ఏం జరుగుతుందో ప్రపంచానికి తెలిసిపోతుందని ప్రభుత్వం భయపడుతోందని అన్నారు.

Arrested

ఇక ఎంత మాత్రం పత్రికా స్వేచ్ఛ లేదని, గత రాత్రి ప్రముఖ టీవీ స్టేషన్లను మూసేశారని అధాలత్ పార్టీ డిప్యూటీ లీడర్ అలీ జహీర్ అన్నారు.

మాల్దీవుల్లో ఇద్దరు విదేశీ జర్నలిస్టులను అరెస్టు చేశారని, వారిలో ఒకతను భారతీయుడు కాగా, మరొకతను బ్రిటిష్ అని, వారు ఎఎఫ్‌పి ఉద్యోగులని విదేశీ వ్యవహారాల మాజీ మంత్రి అబ్దుల్లా షాహిద్ అన్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Two journalists, an Indian and a British national of Indian origin, were on Friday arrested in the Maldives under State of Emergency decree for national security purposes.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి