OSCAR 2024: ఓపెన్‌హైమర్ కు ఆస్కార్ అవార్డుల పంట; 2024 ఆస్కార్ విజేతలు వీరే!!
ప్రపంచ వ్యాప్తంగా సినీ రంగ ప్రముఖులు అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డుల వేడుక లాస్ ఏంజిల్స్ లోని డాల్బీ థియేటర్లో చాలా అట్టహాసంగా జరుగుతుంది. ఈ ఆస్కార్ వేడుకల్లో ఓపెన్ హైమర్ కు అవార్డుల పంట పండింది. 96వ అకాడమీ అవార్డుల ప్రధానోత్సవ వేడుకకు దేశ, విదేశాల నుండి సినీ ప్రముఖులు హాజరు కాగా అవార్డుల ప్రధానోత్సవం ఉత్కంఠగా మారింది.
బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ తో మొదలైన ఆస్కార్ అవార్డుల అందజేత బెస్ట్ పిక్చర్ అవార్డుతో ముగియడం ప్రధానంగా కనిపించింది. ఈసారి ఆస్కార్ అవార్డులలో ఓపెన్ హైమర్, పూర్ థింగ్స్ సినిమాలు అత్యధిక అవార్డులను సొంతం చేసుకుని టాప్ లో నిలిచాయి. ఈసారి ఆస్కార్ అవార్డుల పూర్తి జాబితా విషయానికి వస్తే ఈసారి అకాడమీ అవార్డులలో ఉత్తమ చిత్రంగా ఓపెన్ హైమర్ నిలిచింది.

ఉత్తమ నటుడుగా ఓపెన్ హైమర్ సినిమాలో నటించిన కిలియన్ మర్ఫీకి ఆస్కార్ దక్కగా, పూర్ థింగ్స్ సినిమాలో నటించిన ఎమ్మా స్టోన్ ఉత్తమనటిగా ఆస్కార్ దక్కించుకున్నారు. ఇక బెస్ట్ డైరెక్టర్ గా ఓపెన్ హైమర్ సినిమా క్రిస్టోఫర్ నోలన్ ఆస్కార్ ను దక్కించుకున్నారు. ఉత్తమ సహాయ నటుడిగా ఓపెన్ హైమర్ సినిమాలో నటించిన రాబర్ట్ డౌనీ జూనియర్ కు ఆస్కార్ దక్కింది.
బెస్ట్ సినిమాటోగ్రాఫర్ గా ఓపెన్ హైపర్ సినిమాకు పని చేసిన హెయటే వన్ హోయటేమాకు అకాడమీ అవార్డు వరించింది. బెస్ట్ ఫిల్మ్ ఎడిటింగ్ లో సినిమాకు పనిచేసిన జెన్నిఫర్ లేమ్ కు ఆస్కార్ దక్కింది. బెస్ట్ ఒరిజినల్ స్కోర్ కు కూడా ఓపెన్ హైమర్ లుడ్విగ్ గోరాన్సన్ కు ఆస్కార్ వరించింది.
ఉత్తమ సహాయ నటిగా డివైన్ జాయ్ రాండాల్ఫ్ (ది హోల్డోవర్స్) కు ఆస్కార్ వరించింది. బెస్ట్ యానిమేటెడ్ ఫీచర్ ఫిలిం గా ది బాయ్ అండ్ ది హిరాన్ అకాడమీ అవార్డును దక్కించుకోగా, బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ గా ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్ నిలిచింది. ఇక పూర్ థింగ్స్ సినిమాకు బెస్ట్ హెయిర్ స్టైల్ అండ్ మేకప్ నడియా స్టేసీ, మార్క్ కౌలియర్ కు ఆస్కార్ అవార్డులు దక్కాయి.
బెస్ట్ కాస్టూమ్ డిజైన్ గా హోలి వెడ్డింగ్‌టన్ కు, బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ గా జేమ్స్ ప్రైస్, షోనా హెత్ కు అకాడమీ అవార్డులు వరించాయి.
బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్ ప్లేలో అమెరికన్ ఫిక్షన్ సినిమాకు కార్డ్ జెఫర్‌పన్ ను అకాడమీ అవార్డు వరించింది. బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే లో అనాటమీ ఆఫ్ ఏ ఫాల్ సినిమాకు జస్టిన్ ట్రైట్, అర్థర్ హరారీలకు ఆస్కార్ దక్కింది.
ఇక బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ లో గాడ్జిల్లా మై సన్ వన్, బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ గా ద లాస్ట్ రిపేర్ షాప్ సినిమా బెన్ ఫ్రౌడ్‌పుట్, క్రిస్ బ్రోవర్స్ నిలవగా, బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ 20 డేస్ ఇన్ మరియూపోల్ ఆస్కార్ దక్కించుకుంది. బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ ద వండర్‌ఫుల్ స్టోరీ ఆఫ్ హెన్రీ షుగర్ కు ఆస్కార్ వరించింది.
బెస్ట్ సౌండ్ గా ద జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్ (టార్న విల్లర్స్, జానీ బర్న్) కు ఆస్కార్ దక్కింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ గా బార్బీ చిత్రానికి వాట్ వాజ్ ఐ మేర్ ఫర్ అన్న పాట అకాడమీ అవార్డును దక్కించుకుంది. మొత్తంగా ఈసారి ఆస్కార్ అవార్డులలో చాలా విభాగాలలో టాప్ లో ఓపెన్ హైమర్ నిలవటం గమనార్హం.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications