సౌదీ రాజు ప్రత్యేక విమానంలో అమెరికాకు పాక్ ప్రధాని ఇమ్రాన్! అక్కడా ‘కాశ్మీరే’...
ఇస్లామాబాద్: పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సౌదీ యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్‌కు చెందిన ప్రత్యేక విమానంలో శనివారం అమెరికాకు చేరుకున్నారు. మీరు మా ప్రత్యేక అతిథి.. మీరు మా ప్రత్యేక విమానంలో అమెరికాకు వెళ్లడం మాకు ఆనందంగా ఉందని ఇమ్రాన్‌ను ఉద్దేశించి సౌదీ రాజు వ్యాఖ్యానించారు.
ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అమెరికా పర్యటనకు సంబంధించిన వివరాలను పాక్ విదేశాంగ మంత్రి షా మొహమూద్ ఖురేషీ వెల్లడించారు. శనివారం ఇమ్రాన్ ఖాన్ అమెరికా చేరుకున్నారని, వారం రోజులపాటు కొనసాగనున్న ఈ పర్యటనలో కాశ్మీర్ అంశాన్ని ప్రపంచ దేశాల ముందు ప్రస్తావిస్తారని చెప్పుకొచ్చారు.

కాశ్మీర్ అంశంపై మద్దతు ఇవ్వాలంటూ అమెరికా పర్యటన ముందు సౌదీ అరేబియాలో పర్యటించారు ఇమ్రాన్ ఖాన్. సౌదీ రాజు సల్మాన్ అబ్దులజీజ్ ఆల్ సౌద్ తో భేటీ అయ్యారు. కాశ్మీర్ అంశంతోపాటు పెట్టుబడులు, ఆర్థిక సంబంధాలపై చర్చించుకున్నారు.
Pak PM reaches US in Saudi Crown Prince's 'special' plane
— ANI Digital (@ani_digital) September 22, 2019
Read @ANI Story| https://t.co/JLkaw5TTkN pic.twitter.com/WJAH1AY8AV
ఆ తర్వాత యూనైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనేందుకు ఇమ్రాన్ ఖాన్ అమెరికాకు వెళ్లారు. సెప్టెంబర్ 27న జరిగే సమావేశంలో ఇమ్రాన్ ప్రసంగించనున్నారు. మోడీ కూడా ఇప్పటికే అమెరికాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. అభివృద్ధి, అంతర్జాతీయ శాంతి, భ్రదతల అంశాలను మోడీ ఈ సదస్సులో ప్రస్తావించనున్నారు.
-
మన వాయుసేనలో పాక్ గూఢచారి: దేశ భద్రతను పాకిస్థాన్‌కు తాకట్టు -
ప్రపంచంలోనే తొలి స్థానంలో పాకిస్థాన్.. ఆ ఒక్క విషయంలో.. -
ఇరాన్ పై దాడికి పాకిస్తాన్ ? తెరపైకి సౌదీతో రక్షణ ఒప్పందం..! -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్!












Click it and Unblock the Notifications