అమెరికాలో పాక్ మంత్రికి పరాభావం.. చోర్ చోర్,, అబద్దాల కోరు అంటూ నినాదాలు
అగ్రరాజ్యం అమెరికాలో.. విదేశాలకు చెందిన ప్రముఖులు/ మంత్రులకు పరాభావం తప్పడం లేదు. దాయాది దేశానికి చెందిన మంత్రికి కూడా చుక్కెదురు అయ్యింది. పాకిస్థాన్ ఆర్థిక మంత్రి ఇషాన్ దార్‌ను అమెరికా ఎయిర్ పోర్టులో అడ్డుకుని, దూషించారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఆ వీడియోలో అమెరికాలో పాకిస్థాన్ రాయబారి మసూద్ ఖాన్, ఇతర అధికారులతో కలిసి అమెరికాలోని వాషింగ్టన్ విమానాశ్రయానికి పాకిస్థాన్ అర్థిక మంత్రి ఇషాక్ దార్ వస్తున్నారు. వారిని పలువురు అడ్డుకోవడమే కాదు.. చోర్ చోర్.. అబద్దాల కోరు అని నినాదాలు చేశారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అవుతుంది.
పాకిస్థాన్ ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కొంటోంది.ఇటీవల సంభవించిన వరదలు ఆ దేశంలో విషాదం నింపాయి. రుణాలు తీసుకోవడానికి పలు అంతర్జాతీయ సంస్థలతో పాటు పలు ధనిక దేశాలను పాకిస్థాన్ ఆశ్రయిస్తోంది. ఆర్థికంగా అనేక సమస్యలు, నగదు కొరత, వరద ప్రభావిత దేశానికి అవసరమైన సహాయం కోసం పాకిస్థాన్ ఆర్థిక మంత్రి ఇషాక్ దార్ అంతర్జాతీయ రుణ సంస్థలతో సమావేశాలకు హాజరయ్యేందుకు వాషింగ్టన్ వచ్చారు. అక్కడి విమానాశ్రయానికి రాగానే.. పలువురు గుర్తు తెలియని వ్యక్తులు ఆయనను అడ్డుకున్నారు. ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
పాకిస్తాన్‌కు ఇరాన్ బిగ్ షాక్.. నో పర్మిషన్.. -
ముగిసిన రంజాన్ సెలవులు.. మరోసారి పాకిస్థాన్ భీకర దాడి -
బల్లులు లేని దేశాలు ఇవే బ్రో.. ఎందుకో తెలుసా? -
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..!












Click it and Unblock the Notifications