పాక్ లో మధ్యంతర ఎన్నికలు- సిఫార్సు చేసిన ఇమ్రాన్ : అవిశ్వాసం చర్చ తిరస్కరణ..!!

పాకిస్థాన్ లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. జాతీయ అసెంబ్లీలో ఇమ్రాన్ పైన ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానం పైన ఈరోజున ఓటింగ్ జరగాల్సి ఉంది. అయితే, అనూహ్యంగా ఇమ్రాన్ అడుగులు వేసారు. సభకు ఆయన హాజరు కాలేదు. విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్​ నిర్వహించడాన్ని పార్లమెంట్ స్పీకర్ తోసిపుచ్చారు. ఈ ప్రతిపాదన వెనుక విదేశీ కుట్ర ఉందంటూ స్పీకర్ వ్యాఖ్యానించారు. ఏప్రిల్ 25 వరకు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. ఇదే సమయంలో ఇమ్రాన్ నేరుగా రాష్ట్రపతికి లేఖ రాసారు. జాతీయ అసెంబ్లీ రద్దు చేస్తూ సిఫార్సు చేసారు.

తాజాగా ఎన్నికలకు సిఫార్సు

తాజాగా ఎన్నికలకు సిఫార్సు

దేశంలో వెంటనే ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్రపతిని కోరారు. దీంతో..పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్​కు ఊరట లభించింది. మీడియాలో ప్రసంగించిన ప్రధాని ఇమ్రాన్ ఖాన్... పార్లమెంట్​ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు సిఫార్సు చేస్తూ దేశ అధ్యక్షుడికి లేఖ రాసినట్లు చెప్పారు. దేశ ప్రజలంతా ఎన్నికలకు సిద్ధమవ్వాలని విజ్ఞప్తి చేశారు. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరగాలని పిలుపునిచ్చారు.

సభకు ప్రధాని గైర్హాజరు

సభకు ప్రధాని గైర్హాజరు

సభలో మెజార్టీ నిరూపించుకొనేందుకు ఇమ్రాన్ కు 172 ఓట్లు అవసరం. అయితే, స్వపక్షీయులు సైతం అసమ్మతి స్వరం పెంచటంతో పాటుగా.. వ్యతిరేక ఓటుకు సిద్దమయ్యారు. ఈ సమయంలో స్పీకర్ తో చర్చించిన ఇమ్రాన్ ఆ వెంటనే రాష్ట్రపతికి లేఖ రాసారు.

స్పీకర్ ఇటు తీర్మానం పై ఓటింగ్ తిరస్కరించటం...అటు ఎన్నికలకు సిద్దం కావాలని ఇమ్రాన్ పిలుపునివ్వటంతో ఇక, పాకిస్థాన్ లో మరోసారి ఎన్నికలు ప్రజల ముందుకు వస్తున్నాయి. ప్రధాని పదవికి ఇమ్రాన్ రాజీనామా చేస్తారనే వార్తల నేపథ్యంలో ఆయన సభకు దూరంగా ఉన్నారు. స్పీకర్ నిర్ణయంతో విపక్ష సభ్యులు ఖంగు తిన్నారు.

అసెంబ్లీ రద్దుకు సిఫార్సు

అసెంబ్లీ రద్దుకు సిఫార్సు

తాను ఎవిరికీ లొంగనని..చివరి వరకు పోరాడతానని చెప్పిన ఇమ్రాన్ జాతీయ అసెంబ్లీ రద్దుకు సిఫార్సు చేసారు. రాష్ట్రపతికి రాసిన లేఖలో ఈ మేరకు సిఫార్సు చేసారు. దేశంలో చోటు చేసుకున్న పరిణామాలను వివరించారు. తక్షణం జాతీయ అసెంబ్లీని రద్దు చేసి తాజాగా ప్రజా తీర్పు అవసరమని లేఖలో పేర్కొన్నారు. దీంతో..ఇప్పుడు రాష్ట్రపతి నిర్ణయం కీలకం కానుంది. పార్లమెంట్​ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన ఇమ్రాన్.. ప్రజలంతా ఎన్నికలకు సిద్ధమవ్వాలని విజ్ఞప్తి చేశారు. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరగాలని అన్నారు. దీంతో..ఇప్పుడు చోటుచేసుకొనే పరిణామాలపై ఉత్కంఠ నెలకొని ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+