ఇమ్రాన్ ఖాన్ కు పాక్ సుప్రీంకోర్టు షాక్-స్పీకర్ నిర్ణయం తప్పు-ప్రశ్నించలేరన్న మంత్రులు

పాకిస్తాన్ లో ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం పడిపోవడంతో నెలకొన్న రాజకీయ సంక్షోభం నేపథ్యంలో దీనిపై విచారణ జరుపుతున్న సుప్రీంకోర్టు ఇవాళ కీలక వ్యాఖ్యలు చేసింది. ముఖ్యంగా ఇమ్రాన్ సర్కార్ పై విపక్షాలు పెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని పార్లమెంట్ డిప్యూటీ స్పీకర్ తిరస్కరించడాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది.

ఇమ్రాన్ సర్కార్ పై విపక్షాలు పెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని పార్లమెంట్ డిప్యూటీ స్పీకర్ తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ విపక్షాలు దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టులో ఇవాళ వాడీవేడిగా విచారణ జరిగింది. ఈ సందర్భంగా పాక్ సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్ ఉమర్ అటా బండియాల్.. కీలక వ్యాఖ్యలు చేశారు. డిప్యూటీ స్పీకర్ నిర్ణయం రాజ్యాంగంలోని ఆర్టికల్ 95ను ఉల్లంఘించడమేనని ఆయన అభిప్రాయపడ్డారు.

pakistan supreme court says refusal of no confidence motion against imran khan is wrong

నేషనల్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ ఖాసిం సూరి రూలింగ్ ప్రాథమికంగా ఆర్టికల్ 95 ఉల్లంఘన అని పాకిస్థాన్ ప్రధాన న్యాయమూర్తి ఉమర్ అటా బండియాల్ పేర్కొన్నారు. ఈ కేసుపై ఈరోజు వరుసగా ఐదో రోజు విచారణ జరిగింది. ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్‌పై అవిశ్వాస తీర్మానాన్ని అడ్డుకునేందుకు నేషనల్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ ఖాసిం సూరి చేసిన "రాజ్యాంగ విరుద్ధమైన" చర్యపై సుప్రీం కోర్టు తీర్పు వెలువరించే అవకాశముంది.

మరోవైపు రాజ్యాంగంలోని ఆర్టికల్ 69 ప్రకారం స్పీకర్ రూలింగ్‌ను సవాలు చేయలేమని మాజీ విదేశాంగ మంత్రి షా మహమూద్ ఖురేషీ గురువారం తెలిపారు. సుప్రీంకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో ఖురేషీ స్పందన ప్రాధాన్యం సంతరించుకుంది. అలాగే పాక్ ప్రధాని తరపు న్యాయవాది ఇంతియాజ్ సిద్ధిఖీ కూడా ఈ వ్యాఖ్యల్ని తప్పుబట్టారు. స్పీకర్ తన ప్రమాణం ప్రకారం మెరుగైన నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. ఇది పూర్తిగా పార్లమెంటు అంతర్గత వ్యవహారమని, దీన్ని ప్రశ్నించలేమని తెలిపారు. గతంలో పార్లమెంటు కార్యకలాపాల్లో కోర్టు జోక్యం చేసుకోలేదున్నారు. సభ న్యాయవ్యవస్థ యొక్క అధికార పరిధికి మించినదని ఆయన గుర్తుచేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+