వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇది మిత్రులుగా మార్చే చాయ్!: పాకిస్తాన్‌లో టీ దుకాణం ముందు అభినందన్ ఫోటోతో బ్యానర్

|
Google Oneindia TeluguNews

ఇస్లామాబాద్: పాకిస్తాన్‌కు చెందిన ఓ టీ అమ్మే వ్యక్తి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ అభినందన్ ఫోటోతో ఛాయ్‌లు అమ్ముతున్నాడు. దీని ద్వారా ఓ సందేశం ఇస్తూ వ్యాపారం చేసుకుంటున్నాడు. సదరు వ్యాపారి తన టీ దుకాణం ముందు ఉన్న బ్యానర్‌లో అభినందన్‌ టీ తాగుతున్న ఫొటోను పెట్టుకుని దానిపై... మిత్రులుగా మార్చే టీ ఇక్కడ దొరుకుతుంది అని రాయించాడు. ఇది అక్కడి వారిని అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ టీ షాప్ కరాచీలో ఉంది.

భారత్ సర్జికల్ స్ట్రైక్స్ దెబ్బ: నౌకాశ్రయాలను వదిలి వెళ్లిన పాక్ నావికాదళం, ఎందుకంటే?భారత్ సర్జికల్ స్ట్రైక్స్ దెబ్బ: నౌకాశ్రయాలను వదిలి వెళ్లిన పాక్ నావికాదళం, ఎందుకంటే?

కొందరు ఇందుకు సంబంధించిన ఫొటోలను తమ సోషల్ మీడియా అకౌంట్‌లలో పోస్ట్ చేశారు. ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఈ పాకిస్థానీ వ్యక్తి తన వ్యాపార నైపుణ్యంతో పైలట్ అభినందన్ ఫోటో పెట్టుకొని వ్యాపారం చేస్తున్నాడని ఒకరు, ఇలా కూడా ఫేమస్ కావొచ్చా అని మరొకరు.. ఇలా నెటిజన్లు స్పందిస్తున్నారు.

Pakistan tea seller uses IAF pilot Abhinandan Varthamans photo in banner

జమ్ము కాశ్మీర్‌లోని పుల్వామాలో ఉగ్రదాడి జరిగిన అనంతరం పాక్‌లోని బాలాకోట్‌లో ఉన్న జైష్ ఏ మహ్మద్‌ ఉగ్రవాద స్థావరాలపై భారత్‌ దాడులు చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత పాక్ విమానాలు మన సైనిక స్థావరాన్ని టార్గెట్ చేశాయి. పాక్‌ యద్ధ విమానాలను తరిమికొట్టేందుకు అభినందన్‌ ఓ యుద్ధ విమానంలో వెళ్లారు. పాక్ విమానాన్ని కూల్చేశారు.

అది కూలడంతో పీవోకేలో పాకిస్తాన్‌కు చిక్కారు. ఆ తర్వాత అంతర్జాతీయ ఒత్తిడి, జెనీవా ఒప్పందం ప్రకారం ఆయనను పాకిస్తాన్ విడుదల చేసింది. పాకిస్తాన్ ఆర్మీ ముందు అభినందన్ చాలా ధైర్యంగా వ్యవహరించారు. అతని తీరు, పాకిస్తాన్ సైన్యం అడిగిన ప్రశ్నలకు అతను సమాధానం చెప్పిన తీరు అందరినీ ఆకట్టుకుంది. ప్రశంసలు కురిశాయి.

English summary
Indian Air Force pilot Wing Commander Abhinandan's heroics have not only made him an icon in India but also in Pakistan where he's being presented as a friend. A photo of a Pakistani tea stall with Wing Commander Abhinandan Varthaman's image on its banner has gone viral. What's interesting is that on the banner, Abhinandan can be seen sipping tea in a bold and confident manner with an Urdu text at the bottom that says, "Aisi chai ki dushman ko bhi dost banaye" which translated, means: Tea so fine that it can make a friend out of a foe.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X