Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

తాలిబన్ సర్కార్ లో కీలక పదవులు కోరుతున్న పాకిస్తాన్-మరో కీలుబొమ్మ ప్రభుత్వం దిశగా

ఆప్ఘనిస్తాన్ లో ప్రజా ప్రభుత్వం కూలిపోవడంతో అధికారంలోకి వస్తున్న తాలిబన్లు ఇప్పుడు ప్రభుత్వ ఏర్పాటుపై దృష్టిపెట్టారు. ఆప్ఘనిస్తాన్ పేరును ఇస్లామిక్ ఎమిరేట్స్ ఆఫ్ ఆప్ఘనిస్తాన్ గా మార్చడంతో పాటు ఇస్లామిక్ షరియా చట్టాల్ని అమలు చేసేందుకు తాలిబన్లు ప్రయత్నాలు చేస్తున్నారు. అదే సమయంలో ఈ ప్రభుత్వానికి అంతర్జాతీయంగా మద్దతు పొందేందుకు అవసరమైన ప్రయత్నాలూ జరుగుతున్నాయి.

Recommended Video

    Talibans Clarity on Kashmir. But pak may influence them in long-term process.

    ఆప్ఘనిస్తాన్లో తాలిబన్ల నేతృత్వంలో ఏర్పడబోయే కొత్త ప్రభుత్వం తన కన్నుసన్నల్లో ఉండాలని పాకిస్తాన్ కోరుకుంటోంది. ఇందుకోసం ఇప్పటికే తాలిబన్లతో నిత్యం టచ్ లో ఉంటూ పలు సూచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే తాలిబన్ల రాక నేపథ్యంలో పాకిస్తాన్ కు చెందిన తీవ్రవాద గ్రూపులు ఆప్ఘనిస్తాన్ చేరుకుని అక్కడి ప్రజల్ని దోచుకుంటున్నాయి. వీరిని అదుపు చేయడంతో పాటు కొత్త ప్రభుత్వ ఏర్పాటుపైనా పాకిస్తాన్ నేతలు తాలిబన్లతో చర్చిస్తున్నారు.

    pakistan wants their proxy in new taliban rule in afghanistan, haqqani network to get key posts

    ఆప్ఘనిస్తాన్ లో ఏర్పడే తాలిబన్ల ప్రభుత్వంలో తాము కోరుకున్న వారికి కీలక పదవులు దక్కేలా చూసేందుకు పాకిస్తాన్ లోని ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా ఇరాన్ కు చెందిన హక్కానీ నెట్ వర్క్ నుంచి కీలక నేత సిరాజుద్దీన్ హక్కానీకి కొత్త ప్రభుత్వంలో కీలక బాధ్యతలు అప్పగించాలని పాకిస్తాన్ కోరుతోంది. హక్కానీతో పాటు తాము చెప్పిన పలువురు నేతలకు ప్రభుత్వంలో భాగస్వాముల్ని చేయాలని సూచిస్తోంది. అలా అయితేనే ప్రభుత్వం తమ చెప్పు చేతల్లో ఉంటుుందని ఇమ్రాన్ సర్కార్ భావిస్తోంది.

    మరోవైపు ఆప్ఘనిస్తాన్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేస్తున్న తాలిబన్లకు ముందునుంచీ మద్దతిస్తున్న పాకిస్తాన్... చివరి క్షణాల్లో కాబూల్ సరిహద్దులకు వారు చేరుకున్న సందర్భంగా కూడా పలు సూచనలు చేసినట్లు తెలుస్తోంది. తాలిబన్లు ఆప్ఘన్ ప్రభుత్వం నుంచి శాంతియుతంగా అధికారాన్ని హస్తగతం చేసుకోవాలని భావించగా.. పాకిస్తాన్ మాత్రం దూకుడుగా ముందుకెళ్లి కాబూల్ ను ఆక్రమించాలని వారికి సూచించినట్లు తెలుస్తోంది. ఆప్ఘన్ ప్రభుత్వంలో కీలక నేతలకు పారిపోయే అవకాశమిస్తే భవిష్యత్తులో వారంతా ఒక్కచోట చేరి తిరిగి తాలిబన్లకు వ్యతిరేకంగా పోరాటాలు చేస్తారని హెచ్చరించింది. అయితే తాలిబన్లు మాత్రం అష్రఫ్ ఘనీతో పాటు ఇతర నేతల్ని విదేశాలకు పారిపోయేందుకు అనుమతించడం విశేషం.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+