మా పనే, ప్రవక్తకు గౌరవరం: ప్యారిస్ దాడులపై ఆల్ ఖైదా
పారిస్: ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో దాడులు తమ పనే అని యెమన్ ఆల్ ఖైదా ప్రకటించుకుంది. ప్యారిస్ వ్యంగ్య పత్రిక చార్లీ హెబ్డోపై దాడికి పాల్పడింది తామేనని చెప్పుకుంది. ఈ మేరకు ఓ వార్తా సంస్థకు ఆ గ్రూప్ ప్రకటన విడుదల చేసింది. చార్లీ హెబ్డోపై దాడి చేసిన 12 మందిని హతమార్చిన సంఘటన తమ ఆదేశాల మేరకే జరిగిందని చెప్పింది.
ఇస్లామ్ ప్రవక్త మొహమ్మద్ గౌరవార్థం ప్రతీకార చర్యగానే ఈ దాడికి పాల్పడినట్లు ఆల్ ఖైదా సభ్యుడు చెప్పాడు. భద్రతా కారణాల రీత్యానే ఆల్ ఖైదా దాడులపై ఆలస్యంగా ప్రకటన విడుదల చేసినట్లు వార్తలు వచ్చాయి. ఆల్ ఖైదానే ఈ దాడులకు పాల్పడిందా, దాడులకు సహకరించిందా అని తెలుసుకోవడానికి అమెరికా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.

చార్లీ హెబ్డోపై దాడి చేసినవారిలో ఒకడైన చెరిఫ్ యెమెన్‌కు చెందిన ఆల్ ఖైదా తరఫున తాము ఈ దాడి చేసినట్లు ఫ్రెంచ్ టీవీకి చెప్పాడు. మరిన్ని దాడులు చేస్తామని అరేబియా ద్వీపంలో ఉన్న ఆల్ ఖైదా షరియా అధికారి హరీత్ ఆల్ - నథారీ హెచ్చరించినట్లు వార్తలు వచ్చాయి.
ముస్లింలపై దాడులను ఆపేయాలని, అప్పుడు సురక్షితంగా ఉంటావని, లేకుంటే యుద్ధం తప్పదని అతను అన్నట్లు వార్తలు వచ్చాయి. ఆల్ ఖైదా ప్రకటనతో విభేదిస్తూ పారిస్ దాడులు తమ పనే అని ఇస్లామిక్ స్టేట్ ప్రకటించుకుంది. బ్రిటన్, అమెరికాలపై కూడా దాడులు చేస్తామని హెచ్చరించింది.
తమ ఆపరేషన్ ఫ్రాన్స్‌తో ప్రారంభించామని, ఇక ముందు బ్రిటన్, అమెరికా, తదితర దేశాలపై చేస్తామని ఇస్లామిక్ స్టేట్ హెచ్చరించినట్లు అమెరికా మీడియాలో వార్తలు వచ్చాయి.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications