విమానంలో వీరంగం: ఈ మందుబాబులు విమానంలో ఏం చేశారో తెలుసా..?

విమానాలు గాల్లో ఉండగా అందులోని ప్రయాణికులు ఎన్నో వింత చేష్టలు చేశారనే వార్తలు చదివాం చూశాం. ఓ చైనా ప్రయాణికుడు ఎయిర్‌ హాస్టెస్ మీద వేడి నీళ్లు విసిరిగొట్టడం నుంచి ఓ మహిళ తాను కూర్చున్న చోటే మూత్ర విసర్జన చేయడం వరకు ఎన్నో ఘటనలు చూశాం. ఇవి చాలదన్నట్లుగా మరో ఘటన తాజాగా వెలుగు చూసింది.

మందు కొట్టి తలుపులు తెరిచే ప్రయత్నం

మందు కొట్టి తలుపులు తెరిచే ప్రయత్నం

మాస్కో నుంచి ఫుకెట్‌కు వెళుతున్న నార్‌విండ్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానంలో ఓ మందుబాబు బీభత్సం సృష్టించాడు. ఫుల్‌గా మందు కొట్టి నేరుగా విమానం తలుపు దగ్గరికి వెళ్లి దాన్ని తెరిచే ప్రయత్నం చేశాడు. ఆ సమయంలో విమానం 33వేల అడుగుల ఎత్తులో ఎగురుతోంది. మందుబాబు ప్రవర్తనతో మిగతా ప్రయాణికులు భయపడిపోయారు. దీంతో ప్రయాణికుల్లో ఒకరైన డాక్టరు రంగంలోకి దిగి ఆయన్ను సముదాయించే ప్రయత్నం చేశాడు కానీ విఫలమయ్యారు. దీంతో ఏంచేయాలో తెలియని పరిస్థితి నెలకొంది. ఇక చేసేదేమీ లేక ఆ మందుబాబును విమాన సిబ్బంది ఓ సెల్లో టేపుతో కట్టిపడేసింది.

మందుబాబును కట్టిపడేసిన సిబ్బంది

మందుబాబును కట్టిపడేసిన సిబ్బంది

ఇక అదే సమయంలో ఓ టీవీ రిపోర్టరు కూడా ప్రయాణిస్తున్నారు. వెంటనే ఈ ఘటనను తన మొబైల్ ఫోన్‌లో రికార్డు చేసింది. విమానం లోపల మందుబాబు చేసిన నానా రచ్చ గురించి వివరించింది. విమానం గాల్లో ఉన్న సమయంలో సీటు బెల్టులను బిగ్గరగా ఉంచాల్సిందిగా అలర్ట్ వచ్చిందని చెప్పింది. అయితే ఆ సమయంలో ఎందుకు ఆ ప్రకటన వచ్చిందో తెలియక కన్ఫ్యూజన్‌కు గురయ్యారు ప్రయాణికులు. వెంటనే విమానంలో చివరిన కూర్చున్న ఓ ప్రయాణికుడు మద్యం సేవించి ఉన్నాడనే ప్రకటన వచ్చింది. ఇక మద్యం సేవించి మత్తులో జోగుతున్న వ్యక్తిని ఏడుగురు వ్యక్తులు గట్టిగా ఒడిసిపట్టుకుని అతన్ని కట్టిపడేసినట్లు ఆ టీవీ రిపోర్టర్ తెలిపింది.

 మరో ఇద్దరు తాగుబోతుల వీరంగం

మరో ఇద్దరు తాగుబోతుల వీరంగం

తాష్కెంట్‌లో విమానం ల్యాండ్ అవగానే ఆ వ్యక్తిని ఉజ్బెకిస్తాన్ పోలీసులకు అప్పగించడం జరిగింది. దీంతో ప్రయాణికులకు కాస్త ఊరట లభించింది. అయితే అది ఎంతో సమయం నిలవలేదు. వెంటనే మరో ఇద్దరు మందుబాబులు గొడవకు దిగారు. మళ్లీ విమాన సిబ్బంది రంగంలోకి దిగి వారిద్దరిని వేరు చేసేందుకు నానా తంటాలు పడింది. ఆ తర్వాత మరో వ్యక్తి విమానం వాష్‌రూంలోకి వెళ్లి పొగతాగడం ప్రారంభించారు. అయితే విమానం థాయ్‌లాండ్‌లో ల్యాండ్ అవగానే ముగ్గురు అరెస్ట్ అయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+