వెరైటీ సీన్ : గాల్లో ఎగరాల్సిన విమానం.. బ్రిడ్జి కింద ఇరుక్కుపోయి..! (VIDEO)
చైనా : అప్పుడప్పుడు కొన్ని చిత్ర విచిత్ర సంఘటనలు జరుగుతుంటాయి. కొన్ని సందర్భాల్లో అవి ఫన్నీగా అనిపించినా.. మరికొన్ని సందర్భాల్లో ప్రమాదకరంగా కనిపిస్తుంటాయి. అదే క్రమంలో చైనాలో జరిగిన ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గాల్లో ఎగరాల్సిన విమానం ఫుట్ ఓవర్ బ్రిడ్జి కింద ఇరుక్కుపోవడం చర్చానీయాంశంగా మారింది.
విమానమేంటి, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఏంటని ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇది నిజంగానే జరిగింది. రన్‌వే పై దూసుకెళ్లాల్సిన విమానం కాస్తా ఫుట్ ఓవర్ బ్రిడ్జి కిందకు ఎలా దూరిందనే అనుమానం రావొచ్చు. అయితే అది అనుకోకుండా జరిగింది కాదు. ఒకచోటి నుంచి మరో చోటకు తరలించే క్రమంలో ఈ సన్నివేశం కనిపించింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట బాగా చక్కర్లుకొడుతోంది.

చైనాలోని హర్బిన్ పట్టణంలో విమానం తరలించే క్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పెద్ద ట్రక్కుపై విమానం తీసుకెళుతున్న సందర్భంలో ఫుట్ ఓవర్ బ్రిడ్జి కింద ఇరుక్కుపోయింది. అయితే దాన్ని తరలించేటప్పుడు ఇతర వాహనాలకు ఇబ్బంది కలగకుండా ముందు జాగ్రత్తలు తీసుకున్నారు. రెక్కలు పెద్దవిగా ఉండటంతో వాటిని తొలగించారు. అయితే హైట్ విషయంలో మాత్రం ఆలోచించలేకపోయారు. అదలావుంటే ఆ ట్రక్కు వెళ్లే మార్గంలో ఇలాంటి ఫుట్ ఓవర్ బ్రిడ్జి ఉందని తెలుసుకోలేక పోయారా అనే ప్రశ్నలు సంధిస్తున్నారు నెటిజన్లు.
An airplane was stuck under a footbridge in Harbin, China. Watch how it was removed by a witty driver pic.twitter.com/Puxi4l1AEa
— China Xinhua News (@XHNews) October 21, 2019
ఫుట్ బ్రిడ్జి కింద విమానం ఇరుక్కుపోవడంతో అటు ముందుకెళ్లలేక.. ఇటు వెనక్కి వెళ్లలేక ట్రక్కు డ్రైవర్లు ఇబ్బంది పడ్డారు. చివరకు ట్రక్కు టైర్లలో కాస్తా గాలిని తీసేశారు. అలా ట్రక్కు హైట్ కాస్తా తగ్గింది. అనంతరం ఆ ట్రక్కును ఫుట్ బ్రిడ్జి నుంచి తప్పించారు. ఆ తర్వాత మళ్లీ ట్రక్కు టైర్లలో గాలి నింపి అక్కడి నుంచి తరలించారు.
-
మెగాస్టార్‌కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్‌గా ప్రమోషన్ -
వరల్డ్ కప్ గెలిచినా తప్పని చిక్కులు! ఆ ఆటగాడిపై ఐసీసీ వేటు?












Click it and Unblock the Notifications