Hongqi L5:చైనాలో ప్రధాని ప్రయాణించిన ఈ కారు ఫీచర్స్ తెలిస్తే మైండ్ బ్లాకే!!

ప్రధాని మోదీ షాంఘై సహకార సదస్సు కోసం చైనాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. భారత్, చైనా, రష్యాలాంటి అగ్రదేశాలతో పాటు పాకిస్తాన్ ఇతరత్ర ఆసియా దేశాలు ఈ సదస్సులో పాల్గొంటున్నాయి. ఇప్పటికే జిన్‌పింగ్‌తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు ప్రధాని మోదీ. ఇక మోదీ చైనాలో ల్యాండ్ అయినప్పటి నుంచి ఆయనకు ఎక్కడా అతిథి మర్యాదలు తక్కువకాలేదు. ఇక ప్రపంచ అవనికపై భారత్ స్థానం, భారత్‌కు ఉన్న గౌరవం ఎలాంటిదో ప్రధాని మోదీ ప్రయాణించని కార్లు చెబుతాయి. ఇంతకీ ప్రధాని మోదీ ఎలాంటి వాహనాల్లో ప్రయాణించారు.. వాటి ప్రత్యేకతలేంటి. ఓ లుక్కేద్దాం.

షాంఘై సహకార సదస్సులో పాల్గొనేందుకు చైనాలో ల్యాండ్ అయిన ప్రధాని మోదీకి ఘన స్వాగతం లభించింది. ప్రధాని మోదీ అక్కడ ప్రయాణించేందుకు కావాల్సిన ఏర్పాట్లను స్వయంగా చైనా అధ్యక్షుడు జిన్‌ పింగ్ పర్యవేక్షించినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. ప్రధాని మోదీ ప్రయాణించేందుకు గాను.. జిన్ పింగ్ ఒక విలాసవంతమైన కారును ఏర్పాటు చేశారు. దానిపేరు హాంగ్‌కీ ఎల్‌5 లిమౌజిన్ ( Hongqi L5 limousine). జిన్ పింగ్ ఆయా దేశ పర్యటనలకు వెళ్లినప్పుడు ఇదే వాహనాన్ని వినియోగిస్తారట.హాంగ్‌కీ ఎల్‌5 వాహనం చూడగానే అది చైనాలో తయారైందని ఇట్టే తెలిసిపోతుంది.2019లో జిన్‌పింగ్ భారత పర్యటనకు వచ్చిన సమయంలో ఇదే వాహనంలో ఆయన ప్రయాణించారు.

pm-modi-travels-in-luxurious-hangqi-l5-at-sco-summit-why-is-this-more-than-just-a-car

డ్రాగన్ కంట్రీ రాజసం
చైనాలోని పురాతన కార్ల తయారీ సంస్థ హాంగ్‌కీ (Hongqi), దేశ సాంప్రదాయ సౌందర్యం,ఆధునిక సాంకేతికత కలగలిపి రూపొందించిన అత్యంత విలాసవంతమైన లిమౌజిన్ హాంగ్‌కీ ఎల్‌5 (Hongqi L5) ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. ఇది కేవలం ఒక కారు కాదు, చైనా జాతీయ గర్వానికి ఒక చిహ్నం. అక్కడి ఉన్నత స్థాయి నాయకులు, విదేశీ ప్రముఖుల రాకపోకలకు ఈ కారును ఉపయోగిస్తారు.

చరిత్ర, భవిష్యత్తుల అద్భుత సమ్మేళనం
హాంగ్‌కీ ఎల్‌5 కారు చూస్తే మనకు ఒకేసారి గత చరిత్ర, భవిష్యత్తు కనిపిస్తాయి. దీని డిజైన్ వెనుక ఓ ప్రత్యేకమైన కథ ఉంది. 1960ల నాటి క్లాసిక్ హాంగ్‌కీ సీఏ770 (Hongqi CA770) స్ఫూర్తితో రూపొందించబడిన ఈ కారు.. దానిలోని రెట్రో లుక్‌తో అబ్బురపరుస్తుంది. ఈ కారు ముందు భాగంలో ఉండే భారీ క్రోమ్ గ్రిల్.. రాజసానికి, అధికారానికి ప్రతీకగా నిలుస్తుంది. అంతేకాదు, కారుపై ఎక్కడ చూసినా 'ఎర్ర జెండా' (Hongqi అంటే ఎర్ర జెండా) చిహ్నం ఆ దేశభక్తిని సూచిస్తుంది. ఇది చైనా యొక్క సంస్కృతిని, గతాన్ని, భవిష్యత్తును ఒకే వాహనంలో ఆవిష్కరించే ప్రయత్నం.

ఎల్‌5 కేవలం అందంతో ఆకట్టుకోవడం మాత్రమే కాదు,దానిలోని శక్తి కూడా అంతే గొప్పది.ఇందులో ఉండే 6.0-లీటర్ వీ12 ఇంజిన్ ఏకంగా 408 హార్స్‌పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది.ఇది వేగం కోసం కాకుండా,అత్యంత మృదువైన,నిశ్శబ్దమైన ప్రయాణాన్ని అందించేందుకు రూపొందించబడింది.లోపలికి చేరుకోగానే మనం బయటి ప్రపంచాన్ని పూర్తిగా మర్చిపోతాం.రోడ్డుపై గుంతలు, అడ్డంకులను కూడా ప్రయాణికులకు తెలియకుండా చూసుకునే అధునాతన సస్పెన్షన్ సిస్టమ్ ఇందులో ఉంటుంది.

రాజభవనాన్ని తలపిస్తుంది
కారు లోపలి భాగం ఒక రాజభవనాన్ని తలపిస్తుంది. అత్యున్నత నాణ్యత గల రోజ్‌వుడ్, మెత్తని తోలు సీట్లు, సాంప్రదాయ చైనీస్ సిల్క్ మరియు జేడ్ చెక్కడాలు అద్భుతమైన కళాత్మకతను చూపిస్తాయి. సాంప్రదాయతను పాటిస్తూనే, ఇందులో డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్ వంటి ఆధునిక టెక్నాలజీని కూడా జోడించారు. విలాసవంతమైన ప్రయాణంతో పాటు, ప్రముఖ వ్యక్తులను రవాణా చేసేందుకు అవసరమైన బుల్లెట్‌ప్రూఫ్ గ్లాస్, ఆర్మర్డ్ ప్యానెల్స్ వంటి అత్యున్నత భద్రతా ఫీచర్లు ఇందులో ఉన్నాయి.ఈ విలాసవంతమైన కారును రాల్స్ రాయిస్ ఆఫ్ చైనాగా పిలుస్తారు.

హాంగ్‌కీ ఎల్‌5 కేవలం ఒక వాహనం కాదు, చైనా సాధించిన ప్రగతి, స్వాతంత్ర్యాలకు నిలువెత్తు సాక్ష్యం. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన, అత్యంత ప్రత్యేకమైన కార్లలో ఒకటిగా నిలిచిన ఈ కారు.. చైనా రాచరికానికి, ఆధునికతకు ఒక సజీవ చిహ్నం అని చెప్పొచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+