విద్యార్థుల నగ్న చిత్రాలతో.. ఓ ప్రిన్సిపాల్ నిర్వాకం
విద్యాబుద్దులు నేర్పాల్సిన వ్యక్తే వక్రమార్గం పట్టాడు. చైల్డ్ పోర్నోగ్రఫీకి బానిసయ్యి ఆఖరికి విద్యార్థులను సైతం వదిలిపెట్టలేదు.
లూయిస్‌విల్లీ: చైల్డ్ పోర్నోగ్రఫీకి బానిసైన ఓ స్కూల్ ప్రిన్సిపాల్.. తన స్కూల్లోని పిల్లలను కూడా వదిలిపెట్టలేదు. వారి ఫోన్స్‌ను సీజ్ చేసి వాటినుంచి ఆ చిన్నారులకు సంబంధించిన నగ్న చిత్రాలను దొంగిలించడమే పనిగా పెట్టుకున్నాడు.
దొంగిలించడమే కాదు.. వాటిని పోర్న్ వెబ్‌సైట్స్ లో అప్ లోడ్ చేసి సంబరపడిపోయేవాడు. ఎలిజబెత్ టౌన్‌లోని కెంటకీ హైస్కూల్ ప్రిన్సిపాల్ గా పనిచేస్తున్న స్టీఫెన్ కైల్ గుడ్ లెట్(36) అనే వ్యక్తి చేసిన ఘనకార్యమిది.
చైల్డ్ పోర్నోగ్రఫీని కలిగి ఉండటం.. దాన్ని ఇతరులకు సరఫరా చేయడం వంటి నేరారోపణల కింద బుధవారం నాడు అతనికి ఫెడరల్ నోటిసులు జారీ అయ్యాయి. ప్రస్తుతం తమ అదుపులోనే ఉన్న స్టీఫెన్ కైల్ గుడ్ లెట్ నుంచి మరిన్ని వివరాలు రాబట్టేందుకు పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు.

కాగా, గత సంవత్సరం సెప్టెంబర్ లో ఈ ఘటన వెలుగుచూసింది. ఓ 20ఏళ్ల మహిళ తన నగ్న చిత్రాలు రష్యాకు చెందిన పోర్న్ సైట్ లో దర్శనమివ్వడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె 15ఏళ్ల వయసున్నప్పుడు తన బాయ్ ఫ్రెండ్ కోసం కొన్ని నగ్న చిత్రాలను దిగానని, అవి కాస్త ఇప్పుడు పోర్న్ సైట్లలో దర్శనమిచ్చాయని ఫిర్యాదులో పేర్కొంది.
మొత్తానికి దీన్ని చాలా సీరియస్‌గా పరిగణించిన పోలీసులు.. ఇంటర్నెట్ ఐపీ అడ్రెస్ ద్వారా
గుడ్ లెట్ ను నిందితుడిగా గుర్తించారు. ఈ తతంగమంతా అతని నిర్వాకమే అని గుర్తించారు. అతని వద్ద ఉన్న దాదాపు 60డివైజెస్ లో చైల్డ్ పోర్నోగ్రఫీ ఉన్నట్టుగా పోలీసులు నిర్దారించారు.












Click it and Unblock the Notifications