ఉగ్రవాదానికి కేరాఫ్ అడ్రస్‌గా ఆప్ఘన్.. ఆ పరిస్థితి మారాలి.. ప్రధాని మోడీ
ఆప్ఘనిస్తాన్ అంటేనే ఉగ్రవాదుల కేంద్రం.. అక్కడ టెర్రరిస్ట్, తాలిబాన్ల దాడులతో అల్లాడుతూ ఉంటుంది. ఇటీవల తాలిబాన్లు పగ్గాలు చేపట్టిన దాడుల పరంపర తగ్గడం లేదు. ఆప్ఘనిస్తాన్ పరిస్థితి మార్చే బాధ్యత అందరీపై ఉందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. జీ 20 సదస్సులో వర్చువల్ విధానంలో మోడీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కీలక అంశాలపై ప్రసంగించారు.
ఉగ్రవాదం/ తీవ్రవాద శిక్షణకు ఆప్ఘనిస్తాన్ కేంద్రం కాకుడదని మోడీ అన్నారు. ఆ బాధ్యత ప్రపంచ దేశాలపై ఉందని చెప్పారు. ఆప్ఘన్‌లో పరిస్థితి మెరగుపరచాలని కోరారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో 2593 తీర్మానం చేయాలని ప్రతిపాదించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ కూడా చేశారు. ఆప్ఘన్‌లో మానవ హక్కులను కూడా తిరిగి వారికి ప్రసాదించాలని కోరారు.

Recommended Video
ఆప్ఘన్ ప్రజలు ఆకలి, పోషకహార లోపం కలిగి ఉంటారు. ఈ విషయం జీర్ణించుకోలేని అంశం అని ప్రతీ ఒక్కరు భావిస్తారని మోడీ వివరించారు. వెంటనే ఆ దేశానికి సాయం కావాలని మోడీ కోరారు. తీవ్రవాదం, డ్రగ్స్ స్మగ్లింగ్, ఆయుధాల రవాణాపై కలిసికట్టుగా పోరాడుదామని పిలుపునిచ్చారు. గత 20 ఏళ్లలో పరిస్థితి మారిపోయిందని మోడీ అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా మహిళలు/ మైనార్టీల బతుకు ఛీద్రం అయిపోయిందని వివరించారు.












Click it and Unblock the Notifications