భార్యకు విడాకులిచ్చి బోయ్ ఫ్రెండ్ తో పెళ్ళికి సిద్దం, డయానా వంటమనిషి బురెల్ నిర్ణయం
బ్రిటన్ రాజకుటుంబానికి వంట మనిషిగా పనిచేసిన పాల్ బురెల్ వచ్చే నెలలో తన బోయ్ ఫ్రెండ్ ను వివాహం చేసుకోనున్నాడు. అయితే పాల్ గత ఏడాదిలోనే తన భార్య నుండి విడాకులు తీసుకొన్నాడు.
లండన్:బ్రిటన్ రాజకుటుంబానికి వంటమనిషిగా పనిచేసిన పాల్ బురెల్ వచ్చే నెలలో తన బోయ్ ఫ్రెండ్ ను వివాహం చేసుకోనున్నాడు. బురెల్ తన భార్యకు విడాకులిచ్చాడు. దీంతో బురెల్ తన బోయ్ ప్రెండ్ ను వివాహం చేసుకోవాలని నిర్ణయం తీసుకొన్నాడు.
ఏడాది క్రితం పాల్ తన భార్య మరియాకు విడాకులు ఇచ్చాడు. అయితే చాలా కాలం నుండి భార్య, భర్తలిద్దరూ కూడ వేర్వేరుగానే ఉంటున్నారు. ఇద్దరూ పరస్పర అంగీకారంతోనే విడాకులు తీసుకొన్నారు.

వచ్చే నెలలో వీరిద్దరూ కొంత మంది అతిథుల మధ్య కూపర్, పాల్ లు వివాహం చేసుకోనున్నారు. గతంలో వేల్స్ యువరాణి డయానా దగ్గర పాల్ వంటమనిషిగా పనిచేశాడు.
డయానా వద్ద పాల్ పనిచేసే సమయంలోనే ఓ రియాల్టీ షో లో పాల్గొని పాపులరయ్యాడు. రాజకుటుంబం విషయాలను ప్రస్తావిస్తూ ఆయన ఓ ఆత్మకథను రాశాడు.ఈ ఆత్మకథలో రాజకుటుంబ విషయాలను ఆయన ప్రస్తావించారు.












Click it and Unblock the Notifications