అసలైన ప్రొఫెసర్....క్లాసులో విద్యార్థిని బిడ్డకు తల్లిగా మారిన వైనం....! సోషల్ మీడియాలో వైరల్...
ప్రొఫెసర్లలో కొందరు ప్రోఫెసర్లు వేరయా... ఎందుకంటే, కొంతమంది తమకోసం ఉద్యోగం చేస్తే మరికొంతమంది సమాజం కోసం చేస్తారు.. ఇంకొద్ది మాత్రం దేశ భవిష్యత్‌ను తీర్చిదిద్దే విద్యార్థులు, చదువంటే ప్రాణం ఇచ్చే వారి కోసం ఉద్యోగాలు చేస్తారు. తమ ఉద్యోగ జీవితంలో కూడ అలాగే వ్యవహరిస్తారు.. క్లాస్‌లోని విద్యార్థినికి వచ్చిన కష్టాన్ని తన కష్టంగా భావిస్తారు. క్లాసు లోపల కాకుండా క్లాసు బయట కూడ వారి బాగోగులను చూసుకునే నైజం ఆ ప్రోఫెసర్లలో ఉంటుంది.
ఈ నేపథ్యంలోనే అమెరికాలోని జార్జియా గ్వినెట్ కాలేజీలో ప్రోఫెసర్‌గా పని చేస్తున్న రమాటా సిస్సే కూడ ఇలాగే వ్యవహరించింది. కాలేజిలో చదువుకోవాలనే తాపత్రయం ఉన్న విద్యార్థులకు పిల్లలు ఉన్నా.. చదువును కొనసాగిస్తూ మంచి విద్యార్థితోపాటు మంచి తల్లిగా కూడ ఎదగాలనే సంకేతాలను ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే తన క్లాస్‌కి కన్నబిడ్డతో వచ్చిన విద్యార్ధినికి తన సహకారం అందించి ప్రపంచవ్వాప్తంగా ప్రశంసలు అందుకుంటున్నారు.

ఓ రోజు ప్రొఫెసర్ అనుమతితోనే తన చంటిబిడ్డను తీసుకుని ఓ విద్యార్థిని కాలేజీకి చేరింది. కాని అక్కడ బాబును చూసుకోవడానికి ఎవరు లేకపోవడంతో ఆ విద్యార్థిని ఇబ్బందిపాలైంది. దీంతో ఆ విద్యార్థిని క్లాసు వినేందుకు అవకాశం లేకుండా పోయింది. దీంతో ప్రొఫెసర్ సిస్సే చిన్నపిల్లాడిని తీసుకుని నడుముకు కట్టుకుంది. అలా పిల్లాడితోనే మూడు గంటలపాటు క్లాసులో లెక్చర్ ఇచ్చారు. ఇక ఆ సమయంలో తీసిన ఓ ఫోటోను సిస్సో కూతురు సోషల్ మీడియాలో పోస్టు చేసింది. దీంతో ఆ ఫోటోపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆమె లాంటి తల్లి ప్రపంచానికి అవసరమని కామేంట్ చేశారు. ఇలా లక్షవరకు ఆ ఫోటోలకు లైక్‌లు కొట్టిన పరిస్థితి నెలకొంది.
అయితే పిల్లవాడిని తీసుకువచ్చిన విద్యార్థినికి చదువుపై చాల శ్రద్ద కనబర్చడంతోపాటు త్వరలో ఎగ్జామ్స్ ఉన్నాయని ప్రోఫెసర్ విస్సే చెప్పారు. వాళ్ల గ్రామంలో ప్రయాణంలో పిల్లలను సురక్షితంగా ఉంచడం ఇలా చేస్తారని వివరించారు.
-
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
రోహిత్‌కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
ప్రపంచ్ కప్ తో సూర్య టీం ముందుగా అక్కడికే, వెంట పెట్టుకొని వెళ్లిన జైషా..!! -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
ఇంత నిలకడ మా పోర్ట్‌లోని క్రేన్‌కు కూడా ఉండదు- సంజు శాంసన్ పై ప్రశంసలు -
11 రోజుల్లో 13,560 కి.మీ నాన్ స్టాప్ జర్నీ: చిరు ప్రాణి రెక్కల ముందు సప్త మహా సముద్రాలు చిన్నబోయాయ్ -
తెలంగాణ నూతన సీఎస్ గా- రేవంత్ మార్క్ నిర్ణయం..!! -
కివీసీ ప్లేయర్ కన్నీటి పర్యంతం, ఓడినందుకు కాదు - ఇండియన్ వైబ్రేషన్స్ తో ఒక్కసారిగా..!! -
Kavuri Sambasiva Rao: కావూరి సాంబశివరావు మృతి వార్తలు ? క్లారిటీ ఇదే..! -
పాకిస్తాన్ కు ఐసీసీ భారీ నగదు బహుమతి! ఎన్ని కోట్లంటే..!












Click it and Unblock the Notifications