పార్లమెంట్‌లో సిగరెట్ కాల్చారు..

Sheikh Hasina: పొరుగుదేశం బంగ్లాదేశ్‌లో చెలరేగిన అల్లర్ల నేపథ్యంలో తన పదవికి రాజీనామా చేసిన ఆ దేశ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా.. ప్రస్తుతం భారత్‌లో ఆశ్రయం పొందుతున్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో గల హిండన్ ఎయిర్‌బేస్‌లో తలదాచుకుంటోన్నారు. ఇది తాత్కాలికమే.

బంగ్లాదేశ్‌లో పార్లమెంట్ ఎన్నికలు ముగిసినప్పటి నుంచీ అల్లర్లు కొనసాగుతూనే వస్తోన్న విషయం తెలిసిందే. ఎన్నికల్లో షేక్ హసీనా అక్రమంగా విజయం సాధించారనేది అక్కడి ప్రజల ఆరోపణ. దీనికితోడు ఆర్థిక సంక్షోభం, ఉద్యోగాల్లో కోటా వ్యవస్థ.. వంటి ఆమె సారథ్యంలోని ఆవామీ లీగ్ ప్రభుత్వ పతనానికి దారితీసింది.

Protesters occupy Bangladesh Parliament and Sheik Hasina s official residence in Dhaka

సొంతదేశం నుంచి హెలికాప్టర్‌లో పారిపోయిన షేక్ హసీనా భారత్‌కు చేరుకున్నారు. సోమవారం సాయంత్రం ఆమె తొలుత అగర్తల చేరుకున్నారు. అక్కడి నుంచి సీ-30 రకానికి చెందిన భారత ఆర్మీకి చెందిన రవాణా హెలికాప్టర్ హెర్కులెస్‌లో హిండన్ ఎయిర్‌బేస్‌కు వచ్చారు.

అదే సమయంలో బంగ్లాదేశ్‌లో విధ్వంసకర పరిణామాలు కొనసాగాయి. రాజధాని ఢాకాలో వేల సంఖ్యలో ఆందోళనకారులు రోడ్డెక్కారు. షేక్ హసీనా అధికారిక నివాసం గానబభన్‌ను ముట్టడించారు. సైనిక తిరుగుబాటు నేపథ్యంలో ఆమె నివాసం, పార్లమెంట్ భవనం, ఆవామీ లీగ్ పార్టీ కేంద్ర కార్యాలయాలకు ఎలాంటి రక్షణ అందుబాటులో ఉండట్లేదు.

దీనితో ఆందోళనకారులు హసీనా నివాసంలోకి చొరబడ్డారు. వీరంగం సృష్టించారు. కిచెన్, బెడ్‌రూమ్‌లోకి వెళ్లారు. వంట వండుకుని మరీ తిన్నారు. బెడ్ మీదే పడుకున్నారు. ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. విలువైన వస్తువులను తమ వెంట పట్టుకెళ్లారు. కర్టెన్లను తగులబెట్టారు. కుర్చీలను విరగ్గొట్టారు.

ఇదే తరహా విధ్వంసకర పరస్థిితులు అటు ఆ దేశ పార్లమెంట్ భవనంలోనూ కనిపించాయి. వందల సంఖ్యలో ఆందోళనకారులు పార్లమెంట్ భవనంలోకి దూసుకెళ్లారు. స్పీకర్ స్థానాన్ని ఆక్రమించారు. సభ్యులు ఆసీనులయ్యే కుర్చీల్లో కాలుమీద కాలుపెట్టి మరీ దర్జాగా కూర్చున్నారు. సిగరెట్లను వెలిగించారు. సెల్ఫీలు దిగారు. దీనికి సంబంధించిన పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+