బాయ్‌ఫ్రెండ్‌ను నమ్మి మోసపోయిన 16ఏళ్ల యువతి

స్వీడన్: ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్) ఉగ్రవాదుల చెరలో జీవితం నరకప్రాయమని, బాయ్‌ఫ్రెండ్‌ను నమ్మి తాను మోసపోయానని.. ఐసిస్ బారి నుంచి బయటపడిన ఓ స్వీడన్ యువతి వెల్లడించింది. ఈ నెల 17వ తేదీన ఇరాక్‌లో ఐసిస్ ఉగ్రవాదుల నుంచి ఈ పదహారేళ్ల అమ్మాయిని కుర్దిస్ ప్రత్యేక బలగాలు రక్షించాయి.

ఈ సందర్భంగా ఆమె ఓ టీవీ ఇంటర్వ్యూలో తన కష్టాలను వెల్లడించింది. రెండేళల్ క్రితం స్కూల్ మానేశాక.. బాయ్‌ఫ్రెండ్ కలిశాడని, మొదట్లో తమ సంబంధం బాగానే ఉందని, ఆ తర్వాత ఐసిస్ వీడియోలను చూస్తూ వాటి గురించి మాట్లాడేవాడని చెప్పింది.

Rescued 16 Year Old Swedish Girl Says Life Under ISIS Really Hard

క్రమేణా అతను ఐసిస్ పట్ల ఆకర్షితుడయ్యాడని చెప్పింది. ఐసిస్‌లో చేరుతానని చెబితే తాను ఏమీ అనలేదని, తనకు దాని గురించి అంతగా తెలియదని చెప్పింది. 2015 మేలో స్వీడన్ విడిచి వెళ్లామని, బస్సులు, రైళ్ల ద్వారా యూరప్‌లో ప్రయాణించి, టర్కీ సరిహద్దు ప్రావిన్స్ గజియటెప్ చేరుకున్నామని, అక్కడి నుంచి సిరియా వెళ్లామని చెప్పింది.

ఐసస్ ఉగ్రవాదులు ఇతరులతో కలిసి మమ్మల్ని బస్సులో ఇరాక్ సరిహద్దులోని మోసుల్ నగరం తీసుకు వెళ్లారని, అక్కడ తమకు ఓ ఇల్లు ఇచ్చారని, ఇంటికి కరెంట్ లేదని, తాగునీళ్లు లేవని, నా దగ్గర డబ్బులేదని చెప్పింది. అక్కడ ఎన్నో కష్టాలు పడ్డామని, ఫోన్ ద్వారా తల్లితో మాట్లాడేందుకు ప్రయత్నించినా కుదరలేదని చెప్పింది. తాను మాటల్లో వర్ణించలేని కష్టాలు పడినట్లు చెప్పింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+