సిరియాలో ఉగ్ర స్థావరాలపై రష్యా అటాక్... క్షిపణి దాడి ఇలా... (వీడియో)
సిరియాలోని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద స్థావరాలపై రష్యా శుక్రవారం శక్తివంతమైన క్షిపణులను ప్రయోగించింది. మధ్యధరా సముద్రంలో ఉన్న రెండు యుద్ధ నౌకలు, ఒక సబ్‌మెరైన్ నుంచి ఈ మిస్సైల్స్‌ను లాంచ్ చేశా
మాస్కో: సిరియాలోని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద స్థావరాలపై రష్యా శుక్రవారం శక్తివంతమైన క్షిపణులను ప్రయోగించింది. మధ్యధరా సముద్రంలో ఉన్న రెండు యుద్ధ నౌకలు, ఒక సబ్‌మెరైన్ నుంచి ఈ మిస్సైల్స్‌ను లాంచ్ చేశారు.
చదవండి: ఒమర్ అలియాస్ సుబ్రహ్మణ్యం: ఫేస్ బుక్ లో పరిచయం.. ఐసిస్ వైపు పయనం
ఈ విషయాన్ని రష్యా రక్షణ శాఖ ధృవీకరించింది. టర్కీ, ఇజ్రాయెల్ మిలిటరీకి ఈ దాడుల విషయాన్ని ముందుగానే చెప్పినట్లు రష్యా వెల్లడించింది. అమెరికా విషయాన్ని మాత్రం ప్రస్తావించలేదు.

ముందస్తు సమాచారం లేకుండా సిరియా యుద్ధ విమానాన్ని అమెరికా కూల్చేయడంతో గత సోమవారం నుంచి సిరియా మిలటరీ ఆపరేషన్స్‌పై ఆ దేశానికి రష్యా సమాచారం ఇవ్వడం లేదు.
సిరియాలోని హమా ప్రాంతంలో ఉన్న ఐసిస్ కమాండ్ సెంటర్లు, ఆయుధాగారాలపై ఆరు కాలిబర్ క్రూయిజ్ మిస్సైల్స్‌ను ప్రయోగించినట్లు రష్యా రక్షణ శాఖ తెలిపింది. హఠాత్తుగా రష్యా క్షిపణి దాడులు చేయడంతో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు షాక్ తిన్నారు.
ఐసిస్ ఉగ్రవాదులకు ఈ దాడులతో భారీగా నష్టం వాటిల్లిందని, అనంతరం అదే ప్రాంతంలో వెంటనే వైమానిక దాడులు కూడా చేయడంతో ఉగ్రవాదుల మిగతా స్థావరాలు కూడా ధ్వంసమైనట్లు రష్యా వెల్లడించింది.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications