Vladimir Putin : పుతిన్ కు ఐసీసీ అరెస్ట్ వారెంట్ పై భగ్గుమన్న రష్యా-టాయిలెట్ పేపర్ గా అభివర్ణన..
ఉక్రెయిన్ పై యుద్ధానికి కారణమైన రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్ పై అంతర్జాతీయ న్యాయస్ధానం జారీ చేసిన అరెస్టు వారెంట్ అంతర్జాతీయంగా కలకలం రేపుతోంది.
మాస్కో : ఉక్రెయిన్ పై యుద్ధం చేయడంతో పాటు ఆ దేశానికి చెందిన పిల్లలను చట్టవిరుద్ధంగా దేశం నుంచి బహిష్కరించినందుకు అంతర్జాతీయ క్రిమినల్ న్యాయస్ధానం రష్యా (russia) అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్ (vladimir putin) కు అరెస్టు వారెంట్ జారీ చేసింది. ఈ వ్యవహారం ఇప్పటికే పాశ్చాత్య దేశాలకూ,రష్యాకూ మధ్య నెలకొన్న గ్యాప్ ను, ఉద్రిక్తతల్ని మరింత పెంచింది.
అంతర్జాతీయ కోర్టు పుతిన్ కు జారీ చేసిన అరెస్టు వారెంట్ పై రష్యా భగ్గుమంది. పుతిన్ కు జారీ చేసిన అరెస్టు వారెంట్ తమకు టాయిలెట్ పేపర్ తో సమానమని రష్యా అధ్యక్ష భవనం క్లెమ్లిన్ ప్రకటించింది. హేగ్ లోని అంతర్జాతీయ న్యాయస్ధానం పరిధిని తాము అసలు గుర్తించనేలేదని, అటువంటప్పుడు కోర్టు జారీ చేసే అరెస్టు వారెంట్ కు విలువ లేదని క్రెమ్లిన్ ప్రతినిధి వెల్లడించారు. అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు అరెస్ట్ వారెంట్ జారీ చేయాలన్న అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు నిర్ణయం చట్టబద్ధంగా చెల్లదని తెలిపారు.

మరోవైపు పుతిన్ కు ఐసీసీ అరెస్టు వారెంట్ జారీ చేయడాన్ని రష్యా ప్రభుత్వం, అధికారులు తప్పుబడుతుండగా.. ప్రతిపక్షాలు మాత్రం స్వాగతిస్తున్నాయి. రష్యా పలు దేశాల తరహాలోనే అంతర్జాతీయ న్యాయస్థానం అధికార పరిధిని గుర్తించలేదని, మరియు చట్టపరమైన కోణంలో ఈ కోర్టు నిర్ణయాలు చెల్లవని క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ పేర్కొన్నారు.
రష్యా ఈ సంస్థతో సహకరించదని, అంతర్జాతీయ న్యాయస్థానం నుండి వచ్చే అరెస్టుకు సాధ్యమయ్యే నిర్ణయాలు తమకు సంబంధించినందవరకూ చట్టబద్ధంగా చెల్లవని ప్రభుత్వం వెల్లడించింది.












Click it and Unblock the Notifications